ఫోన్ టెన్షన్ లో హుజురాబాద్ నేతలు ? ఏం మాట్లాడినా తంటానే ?

హుజురాబాద్ నాయకుల్లో ఇప్పుడు ఫోన్ కాల్ టాపింగ్ , ఫోన్ కాల్ రికార్డింగ్ వ్యవహారం దడ దడలు పుట్టిస్తోంది.ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో, అన్ని రాజకీయ పార్టీలు హడావుడి చేస్తున్నాయి.

 Hujurabad, Trs, Congress, Bjp, Phone Taping, Padi Koushik Reddy, Etela Rajendar,-TeluguStop.com

గెలుపు కోసం వ్యూహాలు , ప్రతి వ్యూహాలు పన్నుతోంది.అన్ని విషయాల్లోనూ  పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇక ఈ సందర్భంగా అనేక అంశాలపై నాయకులు , తమ పై స్థాయి నాయకులతో , కిందిస్థాయి కార్యకర్తల తోనూ అన్ని విషయాలు చర్చిస్తూ ఉంటారు.ఈ సందర్భంగా ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలతో పాటు సొంత పార్టీలోని లోపాలను , అంతర్గత సమస్యలను చర్చించుకుని ఓదార్పు పొందుతూ ఉంటారు .అయితే ఇప్పుడు ఫోన్ కాల్ రికార్డింగ్  వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారడం , ఇప్పటికీ ఎంతోమంది రాజకీయ భవిష్యత్తును దెబ్బ తీయడంతో ఎవరు ఫోన్ ఎత్తాలి  అన్నా ఏ విషయంపైనా స్పందించారన్నా, భయపడాల్సిన పరిస్థితి నాయకులకు ఏర్పడింది.

అన్ని పార్టీల నేతలలోను ఈ టెన్షన్ ఎక్కువగా ఉంది.

అసలు టిఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పేరు హుజురాబాద్ లో ఖరారు కావాల్సి ఉన్నా, ఆయన  మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో బయటకు లీక్ కావడంతో అవకాశం కోల్పోయారు.ఇంకా ఎంతోమంది చిన్నా చితకా నాయకులు ఫోన్ కాల్ వ్యవహారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అవి కాకుండా అధికార పార్టీ టిఆర్ఎస్ సొంత పార్టీ నేతల  ఫోన్ లను కూడా వదిలిపెట్టకుండా టాపింగ్ కు పాల్పడుతోందని అనుమానాలు ఆ పార్టీల నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.అందుకే వీలైనంత వరకు కీలక విషయాలపై చర్చించ కూడదని, తమ అభిప్రాయాలను ఫోన్ లో ఎవరికీ తెలియజేయకూడదని చాలామంది నాయకులు నిర్ణయించుకున్నారట.

Telugu Congress, Etela Rajendar, Hujurabad, Phone-Telugu Political News

ఏదైనా విషయం ఉంటే నేరుగా సదరు నాయకులు కలిసినప్పుడు వారి వద్ద చర్చించాలని , అనవసరంగా ఫోన్ కాల్స్ చేసి తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవడం ఎందుకని అభిప్రాయములో  కొంతమంది నాయకులు ఉన్నారట.కొంతమంది నాయకులు ఫోన్ లో ఆటోమేటిక్ కాల్ రికార్డు ఆప్షన్ ఉండడంతో,   సులువుగానే ఎవరు ఏం మాట్లాడిన రికార్డింగ్ అవుతుంది.వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నంత వరకు పర్వాలేదు కానీ, వ్యవహారం బెడిసి కొట్టిన తర్వాత సదరు ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అందుకే చాలామంది నాయకులు ఇప్పుడు ఫోను పక్కన పెట్టడం,  తమ అనుచరులతో మాట్లాడించడం చేస్తున్నారు తప్ప,  నేరుగా స్పందించి కీలక విషయాలపై తమ అభిప్రాయాలను చెప్పే సాహసం చేయడం లేదట.

అసలు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందో లేదో తెలియదు కానీ కాల్ రికార్డింగ్ భయం మాత్రం నాయకులను వెంటాడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube