హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్‌కు వ‌రుస షాక్‌లు.. ఈట‌ల‌కు జై కొడుతున్న ముఖ్య‌నేత‌లు

ఈట‌ల రాజేంద‌ర్ చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి.మొన్న‌టి వ‌ర‌కు ఉన్న ఎన్నో అనుమానాల‌కు ఆయ‌న చెక్ పెడ‌తూ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.

 Huzurabad Constituency Trs Leaders Are Supporting Etela Rajender, Etala Rajender-TeluguStop.com

అయితే ఆయ‌న రాజీనామాతో హుజూరాబాద్లో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి.హుజూరాబాద్ రాజ‌కీయాల‌ను టీఆర్ ఎస్ వేగ‌వంతం చేసింది.

వీలైనంత ఎక్కువ‌మందిని త‌మవైపు తిప్పుకునేందుకు ప్లాన్ వేసింది.కానీ అవేవీ పెద్ద‌గా ఫ‌లించ‌ట్లేదు.

ఉప ఎన్నిక‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈట‌ల ఆ మేరకు నియోజ‌క‌వ‌ర్గంలో పావులు క‌దుపుతున్నారు.త‌న వ‌ర్గీయులు ఎవ‌రైతే టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారో వారితో వ‌రుస‌గా మంత‌నాలు జ‌రుపుతున్నారు.దీంతో వారంతా టీఆర్ ఎస్‌కు గుడ్‌బై చెబుతున్నారు.నిన్న ప‌లువురు ఈట‌ల‌ను క‌లిసి జిందాబాద్ కొట్ట‌గా.

నేడు కూడా మ‌రికొంద‌రు ముఖ్య నేత‌లు ఈట‌లకు మ‌ద్ద‌తు తెలిపారు.దీంతో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎ్‌సకు వ‌రుష షాక్‌లు త‌గులుతున్నాయి.

ఒక్కొక్క‌రుగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్‌ కోట నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.

Telugu Eetala Rajender, Etela Huzurabad, Resign Trs, Etela Rajender, Trs, Veenav

ఏదేమైనా తామంతా మాజీ మంత్రి ఈటలకు మద్దతుగా ఉంటామ‌ని చెబుతున్నారు.తాజ‌గా వీణవంక మండలానికి చెందిన ప‌లువురు ఈట‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపారు.ఈ మండంలోని 7 గ్రామాల సర్పంచ్‌లు, అలాగే వైస్‌ ఎంపీ పీ, స్థానిక పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడి తో పాటు గులాబీ పార్టీ మండల అధ్యక్షుడు ఆ పార్టీకి ఒక్క‌సారిగా షాక్ ఇచ్చారు.

తామంతా ఈట‌ల వెంటే ఉంటామంటూ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తిరుగుబాటు జెండా ఎగ‌రేశారు.ఈ మేర‌కు వీణవంక మండల కేంద్రంలో వారంతా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

అనంత‌రం టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మారముల్ల కొంరయ్య స‌మ‌క్షంలో 12 గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, పలువురు స‌ర్పంచులు కూడా గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు.ఉప ఎన‌నిక‌లో ఈట‌ల‌ను గెలిపించుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube