బీజేపీ లో రాజుకుంటున్న వర్గపోరు ? నష్టపోయేది ఎవరో ?

ఇప్పుడిప్పుడే తెలంగాణా లో బలమైన పునాదులు వేసుకునే దిశగా అడుగులు వేస్తున్న బీజేపీలో ఆ మేరకు పెద్ద ఎత్తున చేరికలు చోటుచేసుకుంటున్నాయి.బలమైన నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు.

 Huzurabad Constituency Is Growing Group Politics In Bjp,  Bjp, Telangana, Trs, C-TeluguStop.com

రెండుసార్లు టిఆర్ఎస్ అధికారంలోకి రావడంతో సహజంగానే పెరిగిన ప్రజా వ్యతిరేకతను చూసి రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి అధికారం దక్కడం అనుమానమే అన్న అభిప్రాయం చాలా మంది నేతల్లో రావడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.ఈ క్రమంలోనే టిఆర్ఎస్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ వంటి వారు బీజేపీలో చేరి పోయారు.

ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్, ఇంకా అనేక మంది నియోజకవర్గ స్థాయి నాయకులు ఈటెల బాటలో వెళ్లి బీజేపీ కండువా కప్పుకున్నారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి మంచి ఆదరణ వస్తుంది అనుకుంటున్న సమయంలో ఆ పార్టీలో గ్రూపు విభేదాలు బయట పడుతుండడంతో, బీజేపీ లోకి వద్దాం అనే ఆలోచనలో ఉన్న నేతలు ఇప్పుడు డైలమాలో పడ్డారు.
  ముఖ్యంగా ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం లో బీజేపీ కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు.ఈ మేరకు ఆయన టిడిపి నుంచి బీజేపీలో చేరిన సమయంలోనే బీజేపీ పెద్దల నుంచి హామీని పొందారు.

అయితే ఇప్పుడు రాజేందర్ బీజేపీలో చేరడం తో తన సీటుకు ఎసరు వస్తుందని , రాజేందర్పదవికి రాజీనామా చేయడంతో మళ్లీ బిజెపి ఆయనకి సీటు ఇస్తుంది అనే భయము పెద్దిరెడ్డి లో కనిపిస్తోంది.మొదటి నుంచి ఈటెల ను తాను వ్యతిరేకిస్తూ వచ్చినా అధిష్టానం పెద్దలు మాత్రం  రాజేందర్ కు పెద్ద పీటే వేశారు అనే బాధ పెద్దిరెడ్డి లోనూ నెలకొంది.

కొంతకాలంగా నియోజకవర్గం పై పట్టు సాధిస్తూ వస్తున్న పెద్దిరెడ్డి ఇప్పుడు మళ్లీ ఈటెల రాకతో ఆ స్పీడ్ మరింతగా పెంచారు.మేరకు ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం లో కీలక నాయకులను కలిసేందుకు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు.

ఈ సందర్భంగా కార్యకర్తలతో కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.

Telugu Bandi Sanjay, Congress, Etela Rajender, Etela Peddi, Peddi, Hujurabad, Jp

  ఈ సమావేశం పై అందరికీ ఉత్కంఠ నెలకొంది.ఇప్పటికే పెద్దిరెడ్డి బుజ్జగించే ప్రయత్నం బిజెపి రాష్ట్ర నాయకులు చేస్తున్నా, ఆయన మాత్రం ఇక్కడ టిక్కెట్ తనకే కేటాయించాలి అని, ముందు తనకే టికెట్ హామీ ఇచ్చారని, ఇప్పుడు తనకు ప్రాధాన్యత తగ్గిస్తే ఊరుకోబోము అన్నట్లుగా ఈటెల మాట్లాడుతూ ఉండడం తో అటు రాజేందర్ వర్గీయుల్లోను ఆందోళన పెంచుతోంది.ఒకవైపు టిఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఉండే పరిస్థితి నెలకొనగా, ఇప్పుడు తాను చేరిన బీజేపీలో ఈ గ్రూప్ పాలిటిక్స్ తనను మరింత ఇబ్బంది పెడతాయనే భయాందోళనలు రాజేందర్ లో నెలకొన్నాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube