రణరంగాన్ని తలపిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక... గెలిచి నిలిచేదెవరు?

Huzurabad By Election Who Will Win

ప్రస్తుత రాజకీయాలు ఒకప్పటితో పోలిస్తే చాలా విభిన్నంగా మారిపోయిన పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం.ఎన్నికలప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమైనప్పటికీ ఇప్పుడు కొంచెం హద్దులు మీరి విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది.

 Huzurabad By Election Who Will Win-TeluguStop.com

దీంతో రాజకీయాలంటే ప్రజలకు ఒకింత అసహ్యం కలిగే పరిస్థితి వచ్చింది.అందుకే ఎన్నికలను తమ ధనార్జనగా ప్రజలు భావిస్తున్నారే తప్ప తమ భవిష్యత్తుపై ఏ మాత్రం ఆశలు పెట్టుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది.

ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సందర్భంగా పార్టీల మధ్య రకరకాల విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది.

 Huzurabad By Election Who Will Win-రణరంగాన్ని తలపిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక… గెలిచి నిలిచేదెవరు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇటు టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ జరుగుతున్నదన్న విషయం మనకు తెలిసిందే.అయితే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నదని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని టీఆర్ఎస్ నేతలు ప్రజలను కోరుతున్న పరిస్థితి ఉంది.

  అయితే ఇక మరి కొద్ది రోజుల్లో ఎన్నిక,  ఫలితం రానున్న రోజుల్లో వెలు వడనున్న తరుణంలో ఫలితంపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది.అయితే ఇక వారం రోజుల్లో పోలింగ్ జరగనుంది కాబట్టి పార్టీలు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

Telugu Huzurabad, Congress, Etela Rajender, Harish Rao, Revanth Reddy, Telangana, Tray, Ts Potics-Political

ఇప్పటికే తమ వ్యూహాలను క్షేత్ర స్థాయిలో అమలు పరుస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రచారం చేయడమే కీలకం కానీ ఎలక్షనీరింగ్ పకడ్భందీగా చేయకుంటే ప్రజల ఓట్లను తమ పార్టీవైపు తిప్పుకునే అవకాశం చాలా తక్కువ.అందుకే ప్రస్తుతం పార్టీలన్నీ  ఇప్పుడు ఎలక్షనీరింగ్ పై దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది.ఏది ఏమైనా ఇక ఉప ఎన్నిక చివరి దశకు చేరుకున్న తరుణంలో పార్టీలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

#Congress #Telangana #Revanth Reddy #Harish Rao #Huzurabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube