రోజుకో ట్విస్ట్ తో రసవత్తరంగా హుజురాబాద్ ఉప ఎన్నిక

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రతి ఒక్క పార్టీ గెలుపూ దిశగా పెద్ద ఎత్తున వ్యూహ ప్రతి వ్యూహాలను రచిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ పార్టీ  దళిత బంధుపై ఆశలు పెట్టుకున్నా దీనిని కాస్త ఎన్నికల సంఘం నిలిపివేయాలని ఆదేశాలివ్వడంతో ఇప్పుడు ఈ అవకాశాన్ని టీఆర్ఎస్ పార్టీ సరిగ్గా ఎన్నికల కొరకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

 Huzurabad By-election Juicy With Daily Twist, Huzurabad Byelections, Trs Party-TeluguStop.com

ఇప్పటికే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ 13 శాతం ఓట్లతో హుజూరాబాద్ లో టీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నదని తమ సర్వేలలో నిరూపితమైనదని కెసీఆర్ స్వయంగా తెలిపిన పరిస్థితి ఉంది.అయితే దళిత బంధు పధకం నిలిచిపోవడంతో ఇప్పుడు బీజేపీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది.

అయితే దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైతే ట్విస్ట్ లమీద ట్విస్ట్ లతో ఉప ఎన్నిక ఫలితం వరకు ఎలాగైతే ఆసక్తి నెలకొందో, ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా అచ్చం దుబ్బాక ఉప ఎన్నికను తలదన్నే రీతిలో ఉండే అవకాశం ఉంది.అయితే ప్రస్తుతానికి బీజేపీ, టీఆర్ఎస్  మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉన్న పరిస్థితుల్లో  కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ప్రచారాన్ని మాత్రం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది.

అయితే బీజేపీ కి టీఆర్ఎస్ కు వచ్చే ఓట్లలో కాంగ్రెస్ వల్ల ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉంది.అందుకే కెసీఆర్ చాలా వరకు పకడ్భందీ వ్యూహంతో ముందుకెళ్తూ టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా హుజూరాబాద్ లో జరుగుతున్న పరిణామాలను  రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా ఒక ఉప ఎన్నిక అసలు సిసలు రాజకీయాన్ని మనం రానున్న రోజుల్లో హుజూరాబాద్ లో చూడబోతున్నామని ప్రజల్లో ఒకింత చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube