బీజేపీకి సవాల్ గా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక..ఎందుకంటే?

ప్రస్తుతం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంతలా హాట్ టాపిక్ గా మారిందన్న విషయాన్ని మనం ప్రత్యేకంగా చర్చించుకోనక్కరలేదు.మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో వచ్చిన ఈ ఉప ఎన్నిక ఇటు టీఆర్ఎస్ కు, బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన పరిస్థితి ఉంది.

 Huzurabad By-election Becomes A Challenge For Bjp Because, Etela Rajender, Trs P-TeluguStop.com

అయితే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తప్పక గెలిచి తీరాలి.లేదంటే ఈ ఓటమి ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికల మీద పడడమే కాకుండా రాష్ట్రమంతా ప్రజలు టీఆర్ఎస్ అంటే వ్యతిరేకత ప్రారంభమైందనే వ్యతిరేక సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది.

అయితే ఇటు బీజేపీ ప్రస్తుతం అధికారంలో లేదు కాబట్టి పెద్దగా బీజేపీకి గెలవడం అంతగా ముఖ్యం కాకపోయినా బలమైన ప్రతిపక్షంగా ఎడగాలనుకుంటున్న బీజేపీ తమకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోదలుచుకోవడం లేదు.అయితే ప్రస్తుతం బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలో పాగా వేయాలని భావిస్తున్న తరుణంలో దుబ్బాకలో గెలిచి ఎలాగైతే బలపడ్డారో, అలా హుజూరాబాద్ లో గెలిచి రాష్ట్రమంతా బలపడాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉన్న పరిస్థితి.

అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలకు ఎట్టి పరిస్థితిలో హుజూరాబాద్ లో గెలవాలని అల్టిమేటం జారీ చేశారట.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @trspartyonline, Bandi Sanjay, Huzuraba

ఇప్పుడు కేంద్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పడు బీజేపీకి హుజూరాబాద్ లో గెలుపొందటం సవాల్ గా మారింది.అయితే బీజేపీకి కొంత అవకాశాలున్నా టీఆర్ఎస్ అత్యంత బలమైన ప్రత్యర్థి కావడంతో బీజేపీ కూడా ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా గెలుపు వ్యూహాలను పకడ్భందీగా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే నేటితో ప్రజా సంగ్రామ యాత్ర కూడా ముగుస్తుండటంతో ఇక బండి సంజయ్ కూడా హుజూరాబాద్ పైనే  ఫోకస్ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube