ఉప ఎన్నికల ప్రచారం .. నేటితో సమాప్తం !

Huzurabad Badwell Election Campaign Ends Today

ఇప్పటి వరకు హోరా హోరీగా బద్వేల్, హుజురాబాద్ ఎన్నికల ప్రచారం సాగింది నువ్వా నేనా అన్నట్లుగా ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.కీలక నేతలు అంతా నియోజకవర్గంలోని ఓటర్ లను కలుస్తూ,  అభ్యర్థి గెలిచే విధంగా ఎన్నెన్నో హామీలు ఇస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈనెల 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతూ ఉండడంతో, 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం ముగించాలి అని ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించడంతో , ఈరోజు సాయంత్రం ఐదు గంటల తో ఎన్నికల ప్రచారాన్ని ముగించబోతున్నారు.30వ తేదీన జరిగే పోలింగ్ ఫలితాలు,  నవంబర్ 2వ తేదీన ఫలితాలను ప్రకటించబోతున్నారు.తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే,  ఇక్కడ ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది.టిఆర్ఎస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజేందర్ బిజెపి లో చేరి,  ఆ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు.

 Huzurabad Badwell Election Campaign Ends Today-TeluguStop.com

ఇక కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ పోటీ చేస్తుండగా,  టిఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇక ప్రధాన పోటీ అంతా బిజెపి టిఆర్ఎస్ మధ్య అన్నట్టుగా ఉంది.హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, మొత్తం నియోజకవర్గం లో 2,36,000 ముందు ఓటర్లు ఉన్నారు.

 Huzurabad Badwell Election Campaign Ends Today-ఉప ఎన్నికల ప్రచారం .. నేటితో సమాప్తం -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓటింగ్ కోసం 306 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు.అలాగే ఎన్నికల్లో ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.

ఇక్కడి ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  తమ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు స్థానికంగా బలమైన నేత కావడంతో గెలుపు దక్కుతుందనే నమ్మకం బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.

Telugu Badvel Elections, Balmuri Venkat, Bjp, Congress, Dasari Sudha, Elections, Etela Rajendar, Hujurabad Elections, Jagan, Kcr, Ktr, Trs-Telugu Political News

అదీ కాకుండా ఇప్పుడు వెలువడబోయే ఎన్నికల ఫలితాలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో , అన్ని పార్టీలు గెలుపు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.హుజూరాబాద్ నియోజకవర్గం లో బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్,  ఈటెల రాజేందర్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ నినాదం తో మోదీ ప్రభుత్వం పని చేస్తుందని,  హుజూరాబాద్ నియోజకవర్గం లో రైల్వే ఓవర్ బ్రిడ్జి లు, అండర్ బ్రిడ్జి లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్,  దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ లు ఎన్నికల నిబంధనలు పాటించడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

  ఇక టిఆర్ఎస్ తరఫున మంత్రి హరీష్ రావు చాలా రోజుల నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండడంతో పాటు,  ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను ఆయన తీసుకున్నారు.

కాంగ్రెస్ నుంచి బల్మూర్ వెంకట్ తరుపున తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తదితరులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఇక ఏపీలోని బద్వేల్ నియోజకవర్గం లో వైసిపి , బిజెపి, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది.  వైసీపీ అభ్యర్థి దాసరి సుధ తరుపున వైసీపీ మంత్రులు,  ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ గెలుపు పై ఆ పార్టీకి ధీమా ఉండడంతో మెజారిటీ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బిజెపి తరఫున కేంద్ర సహాయ మంత్రి మురుగన్, తెలంగాణ రాష్ట్రం లోని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరశ్వరి పార్టీ నేతలు సునీల్ దేవధర్, కన్నా లక్ష్మీనారాయణ, పరిపూర్ణానంద స్వామి తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు .వైసిపి అభ్యర్థి గెలుపు బాధ్యతలను పూర్తిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు.

#Balmuri Venkat #Badvel #Congress #Etela Rajendar #Hujurabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube