హుజూర్‌ నగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనర్హుడు?

అధికార టీఆర్‌ఎస్‌ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలు హోరా హోరీగా సాగబోతున్నాయి.ఈ రెండు పార్టీల మద్యలో బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

 Huzoor Nagar Trs Candidate Is Disqualified-TeluguStop.com

కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో తమవంతు పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక తాజాగా బీజేపీ నాయకులు పలువురు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ను కలిసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిన అనర్హుడిగా ప్రకటించాలంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది.

అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా వారు సమర్పించారు.

ఇటీవల హుజూర్‌ నగర్‌లో శానంపూడి సైదిరెడ్డి తరపున కేటీఆర్‌ ప్రచారం నిర్వహించారు.

ఆ సందర్బంగా భారీ రోడ్డు షోలో కేటీఆర్‌ పాల్గొన్నాడు.ఆ రోడ్డు షోకు ఏకంగా రూ.30 లక్షల రూపాయలను సైదిరెడ్డి ఖర్చు చేశాడంటూ బీజేపీ నాయకులు ఆదారాలను సేకరించడం జరిగింది.ఆ రోడ్డు షోకు సంబంధించిన లెక్కలు మరియు ఇతరత్ర వీడియోలను ఎన్నికల సంఘం ముందు బీజేపీ ఉంచింది.

బీజేపీ ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం ఎంక్వౌరీ మొదలు పెట్టింది.ఆ ఎంక్వౌరీలో సైది రెడ్డి అంత మొత్తం ఖర్చు చేసినట్లుగా నిర్ధారిస్తే సెక్షన్‌ 77(1) ప్రకారం ఆయన అభ్యర్ధిత్వంను రద్దు చేయవచ్చు అంటూ న్యాయ నిఫులు అంటుఆన్నరు.

ఈ విషయమై ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఆందోళనలో ఉంది.రెండు రోజుల్లో ఈ విషయమై ఎన్నికల కమీషన్‌ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube