వైరల్ వీడియో : ఈ కుక్క పిల్ల పెయింటింగ్ అదుర్స్ కదా..!

సోషల్ మీడియా వినియోగం చాలా ఎక్కువ అయింది.ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా  అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

 Huxleythepaanduppy, Painting By Dog, Dog Painting, Social Media, Viral Video, V-TeluguStop.com

ఇలా వైరల్ అవుతున్న వీడియో లలో ఎక్కువ శాతం జంతువులు, పక్షులకు సంబంధించినవి మనం చూస్తూ ఉన్నాం.సాధారణంగా కొన్ని వీడియోలు అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటే.

మరి కొన్ని వీడియోలు అవి ఎప్పటికీ గుర్తుండిపోయే ఉంటాయి.అలాంటి వీడియో లలో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఒక కుక్క పెయింటింగ్ వేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.ఆ కుక్క పిల్ల పేరు హక్స్లే వేస్తున్న పెయింటింగ్ వీడియో బాగా పాపులర్ అందరిని ఆకట్టుకుంటుంది.

అంతేకాకుండా ఈ కుక్క పిల్లకి స్వతః అనే  huxleythepaanduppy పేరుతో ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉండడంతోపాటు ఎప్పటికప్పుడు ఆది చేసే పనులను సోషల్ మీడియా ద్వారా అందరికీ షేర్ చేస్తూ ఉంటారు.

ఇక ఆ వీడియోలో హక్స్ లే ఒక పేపర్ పై పెయింటింగ్ వేస్తూ కళాకృతి కి రంగులద్ది నట్లుగా కుక్క పెయింటింగ్ వేయడం చాలా మందిని ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ “మిమ్మల్ని ఉత్తేజితం గా మార్చేందుకు హక్స్ లే ప్రయత్నిస్తుంది” అనే క్యాప్షన్ జతచేశారు.ఇక ఈ వీడియో చూసిన అనంతరం చాలామంది నేటి రోజు ఆ కుక్క పనితీరును శభాష్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అంతేకాకుండా ఒక వ్యక్తి కుక్క నుంచి నేను పెయింటింగ్ నేర్చుకుంటాను  అనే కామెంట్ చేశాడు.వీడియో ద్వారా కుక్కలలో కూడా కళాకారులు ఉంటారు అని అర్థమవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube