వాస్తు ప్రకారం మీ ఇంట్లో 'బెడ్ రూమ్' ఆ దిక్కున లేకుంటే...భార్యాభర్తల మధ్య గొడవలు తప్పవు!

వాస్తు అంటే నివాసగృహం లేదా ప్రదేశం అని శబ్దార్థం.శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్ధం.

 Husbend And Wifes Right Bed Room Vastu-TeluguStop.com

వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం.మన దేశంలో వాస్తుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

వాస్తు ప్రకారం నిర్మించుకున్న ఇంట్లో కూడా మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తుంటాం దానివలన కష్టాలు తప్పవు.

ఇల్లు కట్టే ముందు వాస్తు పక్క చూసుకుంటారు, పడక గది ఎటు వైపు ఉండాలి, వంట గది ఏ వైపు ఉండాలి, తూర్పు ఉత్తరం దక్షిణం అంటూ వాస్తును నమ్ముతారు, ఎందుకంటె ఇల్లు అనేది జీవితం లో ఒక ముఖ్య భాగం, ఇంటిని నిర్మించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం, కొత్తగా ఇల్లు కట్టుకున్నాం.కానీ ఇంటికి నైరుతి లోపం ఉంది.అందుకు వాస్తు ప్రకారం ఇలా చేస్తే చాలు.

మంచి ఫలితాలు కలుగుతాయి.నైరుతిలో పడకగదిని నిర్మించుకోవాలి.

ఒకవేళ ఆ దిశ లేకపోతే నైరుతి పడమర అంటే.పడమర దిశకు సమానంగా ఇంటిని సరిచేసుకుంటే మంచిది.

అప్పుడే నైరుతిలో పడకగది వస్తుంది.నైరుతితో పడక గది నిర్మించకపోతే భార్య, భర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడే అవకాశాలున్నాయి.

అందువలన మీ గృహాన్ని సరిచేసి హాలులో నైరుతి దిశగా పడక గదిని అమర్చుకోవాలి.అలాగే దక్షిణం, పడమర దిశను మూయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.ఒకవేళ ఆ దిశలు మూసివేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయని.వాటిని భరించడం చాలా కష్టమేనని చెప్తున్నారు.కాబట్టి వీలైనంత వరకు ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం కట్టుకుంటే మంచిది.వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది.

శాస్త్ర ప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇల్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించాలని వాస్తునిపుణులు సూచిస్తున్నారు.

వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఇంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాస్తుపరమైన ఇబ్బందులే ముందు గుర్తొస్తాయి.

కాబట్టి గృహం నిర్మాణం చేపట్టే ముందే వాస్తుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube