గుడిలో కుడి కాలు పెట్ట‌క‌పోవ‌డంతో వ‌ధువుకు షాక్ ఇచ్చిన ఆడ‌ప‌డుచు!

పెళ్లి చేసుకుని అత్తగారింట్లో సంతోషకరమైన జీవితం గడపాలని ఆశించిన ఓ మహిళకు మొదటి రోజు నుంచే కష్టాలు మొదలయ్యాయి.కట్నం ఎక్కువ కావాలని అత్తింటి వారు వేధింపులకు గురి చేసినా, విడిపోతే సమాజంలో నవ్వుల పాలు అవుతామని బాధలను భరించింది.

 Husbands Sister Harass The Bride When She Did Not Put Her Right Foot In The Temple-TeluguStop.com

అంతా సర్దుకుంటుందని ఆమె భావిస్తున్నా తరుణంలో, అదనపు కట్నం కావాలని అత్తింటి వారు ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తుండంటంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్తింటి వారిని జైల్లో పెట్టారు.వివరాల్లోకి వెళితే.

మహారాష్ట్రలోని నిగ్డి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల మహిళ డిసెంబర్, 2020లో ఓ యువకుడిని వివాహం చేసుకుంది.

 Husbands Sister Harass The Bride When She Did Not Put Her Right Foot In The Temple-గుడిలో కుడి కాలు పెట్ట‌క‌పోవ‌డంతో వ‌ధువుకు షాక్ ఇచ్చిన ఆడ‌ప‌డుచు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెళ్లి కొడుకు ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.

వివాహం జరిగిన సమయంలోనే వరుడికి కట్నం కింద లక్ష రూపాయలు, 20 తులాల బంగారం, ఇతర కట్న కానుకలు ఇచ్చారు.అయితే పెళ్లి అయిన తర్వాత రోజు అందరూ కలిసి గుడికి వెళ్లగా, సదరు మహిళ కుడి కాలుకు బదులుగా ఎడమ కాలును మొదట పెట్టి గుడిలోకి ప్రవేశించింది.

దీంతో వరుడి సోదరి మహిళను బంధువుల ముందే చెంప మీద కొట్టి అవమానించింది.అంతే కాకుండా, మరింత కట్నం కావాలని మహిళను రోజూ శారీరక, మానసికంగా చిత్రహింసలకు గురి చేసేవారు.

కట్నం తీసుకుని రాకపోతే ఇంటికి పంపుతామని ఆమెను బెదిరించేవారు.

Telugu Bride Harassment, Bride Shoks, Dowry, Husband It Employee, Left Foot In Temple, Maharashtra, Nigidi, Police Arrest, Temple-Latest News - Telugu

అయితే, వారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న మహిళ వేధింపులను భరించసాగింది.చివరకు ఆమె భర్త కూడా దారుణంగా హింసించడంతో భర్త, భర్త సోదరి, అత్త మామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.అదనపు వరకట్న వేధింపులు, గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని అరెస్టు చేసి జైలులో పెట్టారు.

ఎంతైనా ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి క‌దా.

#Maharashtra #Temple #Nigidi #Employee #Temple

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు