బాత్రూం లో ఎక్కువ సేపు ఉంటున్న భర్త.. భార్య ఏం చేసిందంటే?

సాధారణంగా భర్తలను వదిలిపెట్టడానికి, వారి నుంచి విడిపోవడానికి భార్యలకు కొన్ని రకాల కారణాలు ఉంటాయి.ముఖ్యంగా భర్త తాగుబోతు కావడం, వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఏ పని చేయకుండా సోమరిపోతుగా ఉండటం లాంటి కారణాలు ఉంటాయి.

 Husband Who Stays In The Bathroom For A Long Time What Did The Wife Do-TeluguStop.com

అయితే, ఒక మహిళ మాత్రం విభిన్నమైన కారణంతో తన భర్తను విడిచిపెట్టింది.అదేమిటి అంటే, తన భర్త ఎప్పుడూ టాయిలెట్‌లోనే ఉండటమని వింత కారణం చెప్పి అందరినీ ఆశ్చర్యపర్చింది.

ఎవరైనా టాయిలెట్‌కు కొద్ది నిమిషాల పాటు వెళ్తారు కానీ, తన భర్త మాత్రం గంటలకొద్దీ టాయిలెట్‌లోనే ఉండటంతో విరక్తి కలిగి విడాకులు ఇచ్చానని ఆమె వాపోయింది.

 Husband Who Stays In The Bathroom For A Long Time What Did The Wife Do-బాత్రూం లో ఎక్కువ సేపు ఉంటున్న భర్త.. భార్య ఏం చేసిందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీని గురించి ఆమె ఈ విధంగా చెప్పింది.‘నా భర్త పేరు జస్టిన్.అతను ఇంట్లో ఉండం కంటే ఎక్కువ సేపు టాయిలెట్‌లోనే గడుపుతాడు.

అతనికి ఇల్లు నచ్చక అలా చేస్తున్నాడని కొద్ది రోజుల కిందటే కొత్త ఇంటికి కూడా షిఫ్ట్ అయ్యాము.తీరా చూస్తే అక్కడ కూడా ఎక్కువ సేపు టాయిలెట్‌లోనే ఉంటున్నాడు.

ఇంకా వెరైటీ ఏమిటంటే, మేము ఇద్దరం కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు కూడా టాయిలెట్‌కు వెళ్లాడు.కొన్ని నిమిషాల్లోనే వస్తాను అని చెప్పి చాలా సేపు అక్కడే ఉన్నాడు.

చివరకు నేను బాత్‌రూమ్‌కు వెళ్లి డోర్ కొట్టినా కూడా అస్సలు రాలేదు.నేను రెస్టారెంట్‌లో భోజనం తిని బిల్లు కట్టి, కారు బుక్ చేసుకుని ఇంటికి కూడా వెళ్లాను.

నేను వచ్చిన ఇరవై నిమిషాల తర్వాత నా భర్త వచ్చాడు’ అని ఆమె తెలిపింది.

Telugu Divorece, Husband Justin, Husband Spent In Bathroom, More Time In Toilet, Netizens Comments, Social Media, Wife Shock S-Latest News - Telugu

అయితే, దీనిపై ఇంటర్నెట్లో యూజర్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.అంత సేపు టాయిలెట్‌లో ఉండి అతడు ఏం చేస్తాడని అందరూ సందేహం వ్యక్తి చేస్తున్నారు.ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస అయ్యాడని, అశ్లీల వీడియోలు చూడటానికే టాయిలెట్‌లోకి వెళ్తున్నాడని, భార్య పైన ఇష్టం లేక అలా చేస్తున్నాడని చాలా మంది కామెంట్లు చేశారు.

అయితే టాయిలెట్ వెళ్లేటప్పుడు ఫోన్ తీసుకెళ్లకుండా చూడాలని, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలని కొందరు సూచించారు.

#Divorece #MoreTime #Husband Justin #HusbandSpent #Wife Shock S

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు