యువకుడితో ఆంటీ గోవా ట్రిప్..భర్త ఎలా పట్టుకున్నాడో తెలిస్తే షాకే       2018-06-28   00:29:20  IST  Raghu V

రాను రాను భార్యా భర్తల సంభందాలకి విలువ లేకుండా పోతోంది..పెళ్లి చేసుకున్న తరువాత పై పై మెరుగులకి ఆశపడి.భర్త ని దూరం పెడుతూ వాయి వరసలు..వయసు భేదం ఇలాంటివన్నీ గాలికి వదిలేసి పిల్లలని సైతం పట్టించుకోకుండా అక్రమ సంభందాన్ని కొనసాగించడం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా అయ్యిపోయింది.. సమాజానికి ఒకప్పుడు భారతీయ మహిళా భయపడేది ఎంతో అనుకువగా ఉండేది ఇప్పుడు సమాజం గురించి నాకు అనవసరం ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అంటూ బరితెగిస్తున్నారు అయితే ఇలాంటి కోవకి చెందిన ఓ మహిళ తన ప్రియుడితో గోవా చెక్కేసింది అయితే ఆమె భర్త టెక్నాలజీ ని ఉపయోగించి మరీ వారు ఆచూకి తెలుసుకుని పోలీసులకి తెలిపాడు..వివరాలలోకి వెళ్తే..

ఈస్ట్‌ శ్రీనివాస్‌నగర్‌ కాలనీకి చెందిన మాధవ్‌ (25) డిగ్రీ పూర్తి చేశాడు. ఈ యువకుడికి తన కంటే వయస్సులో 10 ఏళ్లు పెద్దదైన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది..అది రాను రాను తీవ్రస్థాయికి చేరుకొని అందరికీ తెలిసే పరిస్థితి ఏర్పడింది.ఈ విషయంలో ఆమె భర్త ఎంతగానో అతడికి చెప్పినా సరే మాధవ్‌ వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.. ఈ విషయం తెలుసుకున్న మహిళ భర్త ఆమె కారుకు జీపీఎస్‌ను అనుసంధానం చేశాడు.

ఈ క్రమంలో భర్తకి దూరంగా పిల్లలతో ఉంటున్న ఆమె ప్రియుడితో కలిసి గోవా ట్రిప్ వేసింది..అయితే ఈ విషయం ఆమె భర్త కారుకున్న జీపీఎస్‌ ఆధారంగా భర్త గుర్తించాడు. నమ్మకద్రోహానికి పాల్పడిన భార్యతో పాటు యువకుడిని పట్టుకోవాలని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు…అయితే ఈ సీన్లో ట్విస్ట్ ఏమిటంటే మీరు వాల్లిదరిని పట్టుకోండి..అవసరం అయితే విమాన చార్జీలు కూడా నేనే భరిస్తాను అని చెప్పడం కొసమెరుపు.