అయ్యబాబోయ్ ఈవిడ భార్య కాదు.. భయంకర రక్కసి.. ?

కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ అనీ అంటారు ఆడవారిని.కానీ నేడు సమాజంలో వీటికి భిన్నంగా కొందరు ఆడవారు ప్రవర్తిస్తున్నారు.

 Husband Terribly Killed By Second Wife-TeluguStop.com

పురాణాల్లోని ఆడ రాక్షసులకంటే దారుణంగా మారుతున్నారు.కట్టుకున్న భర్తలను హత్యచేయడానికి ఏ మాత్రం సంకోచించలేని వనితలు నేడు ఉన్నారు.

ఇలాంటి మహిళ వార్త ఇప్పుడు మనం చదవబోయేది.అదేంటో చూస్తే.హైదరాబాద్ పరిధిలోని వనస్థలిపురంలో గత నెలలో గగన్‌ అగర్వాల్‌(38) అనే వ్యక్తిని అదృశ్యమైయ్యాడట.దీంతో అతని భార్య నౌసిన్‌, గగన్‌ సోదరుడు ఇద్దరు కలిసి ఎల్బీ నగర్‌ పోలీసులను ఆశ్రయించారు.

 Husband Terribly Killed By Second Wife-అయ్యబాబోయ్ ఈవిడ భార్య కాదు.. భయంకర రక్కసి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా భయంకరమైన నిజం బయటపడిందట.

కాగా అతడి రెండో భార్యే హత్యచేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అదీకూడా గుట్టు చప్పుడు కాకుండా అతన్ని ఇంట్లోనే హతమార్చి, తమ ఇంట్లోనే అతడిని పూడ్చిపెట్టినట్లు వెల్లడైందట.అయితే ఈ కేసుకు సంబంధిచిన మరి కొన్ని వివరాలు బయటకు రావల్సి ఉందట.

ఇక గగన్ రెండేళ్ల క్రితం తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, గత జూన్ ‌లో నౌసిన్‌ బేగం ను పెళ్లి చేసుకున్నాడట.మరి కట్టుకున్న వాడిని చంపేటంతటి కక్ష ఏముందో తెలియవలసి ఉంది.

ఇకపోతే గగన్‌ ను హత్య చేసిన అతని రెండో భార్యను‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట.

#Husband #Hyderabad #Noushin Begum #Gagan Agarwal #Vanasthalipuram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు