భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఈ పనులను చేయకూడదు!

పెళ్లి అయిన ప్రతి ఒక్క మహిళా అమ్మ కావాలని కోరుకుంటుంది.ఇలా తల్లి కావడం అనేది కూడా ఓ గొప్ప వరం అని భావిస్తారు.

 Husband Should Not Do These Things While Wife Is Pregnant, Husband, Wife, Pregnant Time, Health Tips, Take Care-TeluguStop.com

అయితే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతి భార్య తన భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుంది.అలాగే ప్రతి భర్త కూడా తన భార్యకు దగ్గరగా ఉండి తనకు కావలసిన సహాయం చేయాలని భావిస్తారు.

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త తన భార్యను సంతోషంగా చూసుకున్నప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ ఎంతో ఆరోగ్యవంతంగా పుడుతుంది.అయితే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులను అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

 Husband Should Not Do These Things While Wife Is Pregnant, Husband, Wife, Pregnant Time, Health Tips, Take Care-భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఈ పనులను చేయకూడదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి ఆ పనులు ఏమిటి అనే విషయానికి వస్తే.

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త పొరపాటున కూడా తనని వదిలి ఇతర దేశాలకు వెళ్ళకూడదు.

అదేవిధంగా భార్య గర్భవతి అని తెలిసినప్పటి నుంచి భర్త నదీస్నానాలు చేయకూడదు.అలాగే భార్యకు ఏడవ నెల వచ్చిన తర్వాత భర్త ఎలాంటి పరిస్థితులలోనూ పడవ ప్రయాణాలు చేయకూడదు.

అదేవిధంగా భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త పొరపాటున కూడా ఒక చెట్టును నరకకూడదు అలాగే పామును కూడా చంపకూడదు.ఇలా చేయటం వల్ల పుట్టబోయే బిడ్డపై అధికంగా చెడు ప్రభావం చూపే పరిస్థితులు ఉంటాయి.

Telugu Tips, Pregnant Time, Care-Movie

అదే విధంగా మీ భార్య ఏడవ నెల గర్భవతి అయినప్పటి నుంచి భర్త పొరపాటున కూడా షేవింగ్ చేసుకోకూడదు.అలాగే శవ యాత్రలకు వెళ్ళకూడదు, శవాలను మోయకూడదని పండితులు చెబుతున్నారు.భార్య గర్భంతో ఉన్నప్పుడు గృహ నిర్మాణాలు చేపట్టడం లేదా గృహ ప్రవేశం చేయడం, శాంతి హోమం చేయటం, పిండ ప్రదానాలు చేయడం వంటివి చేయకూడదు.ముఖ్యంగా ఏడవ నెల గర్భవతిగా భార్య ఉన్నప్పుడు భర్త తీర్థయాత్రలు కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube