భార్య విడాకులకు ఒప్పుకోవడం లేదని భర్త ఏం చేశాడో తెలుసా.. వీడిని చెట్టుకు కట్టేసి కొట్టినా తప్పులేదు

అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇచ్చుకోవడం వంటివి చాలా కామన్‌.

కాని ఇండియన్స్‌ చాలా తక్కువ సందర్బాల్లో, చాలా అరుదుగా మాత్రమే విడాకులు తీసుకుంటారు.

ఇండియాలో విడాకుల సంఖ్య ఇతర దేశాలతో పోల్చితే తక్కువ.ఎన్ని గొడవలు వచ్చినా కూడా కలిసి ఉండాలని ఇండియన్స్‌ భావిస్తారు.

కాని ఇతర దేశాల్లో మాత్రం చిన్న గొడవలకు కూడా విడాకులు అంటూ ఉంటారు.తాజాగా గుజరాత్‌ కు చెందిన ఒక యువతి నుండి ఆస్ట్రేలియాలో ఉంటున్న ఇండియన్‌ మొగుడు విడాకులు తీసుకోవాలనుకున్నాడు.

కాని ఆమె విడాకులు ఇచ్చేందుకు నో చెప్పడంతో ఏ భర్త చేయకూడని పని చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళ్తే.గుజరాత్‌కు చెందిన యువతికి, ఆస్ట్రేలియాలో ఉండే ఒక యువకుడితో 2015వ సంవత్సరంలో పెళ్లి అయ్యింది.పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్న వీరిద్దరు గత కొంత కాలంగా విభేదాలతోనే కాలం గడిపేస్తున్నారు.

ఆ యువతి ఎప్పటికైనా భర్తతో సంతోషంగా ఉండవచ్చు అని ఎదురు చూస్తుంది.కాని అతడు మాత్రం ఇక జీవితంలో కలిసి ఉండటం అసాధ్యం.విడాకులు తీసుకుందాం అంటూ ఒత్తిడి చేశాడట.

ఎంతగా ప్రయత్నించినా కూడా ఆమె విడాకులకు ఓకే చెప్పలేదు.

విడాకులకు ఆమె ఓకే చెప్పక పోవడంతో కోపంతో రగిలి పోయిన అతడు ఏం చేసైనా ఆమె నుండి విడాకులు పొందాలనుకున్నాడు.అందుకోసం ఆమెకు కోపం తెప్పించాలనుకున్నాడు.అనుకున్నదే తడువుగా ఆమె అసభ్యంగా ఉన్నప్పటి ఫొటోలను, గతంలో సరదాగా తీసుకున్న అశ్లీల ఫొటోలను భర్త ఫేస్‌బుక్‌ లో షేర్‌ చేశాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 26, మంగళవారం, 2022

భర్త చేసిన పనికి ఖంగుతిన్న భార్య అహ్మదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

ప్రస్తుతం భర్త ఆస్ట్రేలియాలో ఉండగా, భార్య గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉంది.అక్కడ నుండే ఫోటోలు షేర్‌ చేసి నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ మెసేజ్‌ చేశాడట.దాంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించింది.

ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌ ద్వారా తొలగించిన పోలీసులు ప్రస్తుతం అతడిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.యువతి తరపు బంధువులు అతడిని ఎలాగైనా ఇండియాకు రప్పించాలని, అశ్లిల ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టినందుకు గాను అతడిని చెట్టుకు కట్టేసి కొట్టాలన్నంత కోపంతో ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు