బట్టలపై భార్య రక్తం.. భర్తకి జీవితఖైదు.. ఎందుకంటే?  

blood, wife, clothes, husband, jail, Husband sentenced to Jail in Mumbai - Telugu Blood, Clothes, Husband, Husband Sentenced To Jail In Mumbai, Jail, Wife

భార్య భర్తల మధ్య నమ్మకం అనేది బలమైన పునాది లాంటిది అనే విషయం తెలిసిందే.ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య నమ్మకం పోయి అనుమానం వచ్చిందంటే తరచూ గొడవలు పడుతూ ఉంటారు.

TeluguStop.com - Husband Sentenced To Jail Mumbai

Source:TeluguStop.com

ఇక్కడ భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త .సూటిపోటి మాటలతో తరచూ వేధించే వాడు.దీంతో పుట్టింటికి వచ్చిన భార్య కొన్ని రోజుల్లోనే హత్యకు గురికావడం సంచలనంగా మారిపోయింది.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధారాలతో భర్త భార్యను హత్య చేసినట్లు తేల్చారు, ఈ దారుణ ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది.

TeluguStop.com - బట్టలపై భార్య రక్తం.. భర్తకి జీవితఖైదు.. ఎందుకంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

ముంబైకి చెందిన మండలేకర్ అదే ప్రాంతానికి చెందిన శ్రేయని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరిద్దరికీ 2003లో పెళ్లి జరిగింది.వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.కొంతకాలం పాటు కాపురం సాఫీగానే సాగిపోయింది.కానీ ఆ తర్వాత భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అంటూ అనుమానించడం మొదలు పెట్టాడు భర్త.దీంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

భర్త తీరుతో విసిగి పోయిన భార్య 2017లో కొడుకుతో సహా పుట్టింటికి వచ్చేసింది.

ఆ తర్వాత కొన్నాళ్లకే దారుణ హత్యకు గురైంది భార్య.

ఈ నేపథ్యంలో భర్త హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలో తేలింది.కోర్టులో హాజరుపరచగా తాను అసలు ఆరోజు ఊర్లోనే లేనని తన భార్య ను హత్య చేయలేదు అంటూ వాదనలు వినిపించారు.

అయితే ఎన్నో మాయమాటలు చెప్పిన భర్త వాటికి ఆధారాలు చూపించలేకపోయాడు… అయితే హత్య జరిగిన రోజు రక్తపు మరకలతో భర్త బయటకు వచ్చాడు అని స్థానికులు చెప్పడంతో ఈ ఆధారంగానే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు తెలిపారు.దీంతో అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది.

#Jail #Clothes #Blood #Husband #Wife

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Husband Sentenced To Jail Mumbai Related Telugu News,Photos/Pics,Images..