భార్య కలలోకి వచ్చిన ఏనుగు.. నిజం చేసిన భర్త!  

husband sells land buys elephant to fulfill wife\'s dream, Elephant, Wife dream, husband, Gifted Elephant - Telugu Bangladesh, Dulal Chandra Ray, Elephant, Gifted Elephant, Husband, Husband Sells Land Buys Elephant To Fulfill Wife\\'s Dream, Tulasi Laxmi, Wife Dream

సాధారణంగా ఏ ఇంట్లో అయినా భార్య అడిగే చిన్నచిన్న కోరికలను భర్త తీరుస్తూ ఉంటాడు.ఆ కోరిక గొంతెమ్మ కోరిక అయితే మాత్రం తీర్చడానికి ఆలోచిస్తాడు.

TeluguStop.com - Husband Sells Land Buys Elephant To Fulfill Wife Dream

అయితే ఒక భార్య మాత్రం భర్తను విచిత్రమైన కోరిక కోరింది.తనకు కలలో ఏనుగు కనిపించిందని, ఏనుగు కావాలని అడిగింది.

ఇలాంటి వింత కోరిక కోరితే ఏ భర్త అయినా భార్యను తిడతాడు.కానీ ఆ భర్త మాత్రం భార్యపై ఉన్న ప్రేమ వల్ల ఆమె కన్న కలను నిజం చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్‌లోని లాల్మోనిర్హాత్ ప్రాంతంలో దులాల్ చంద్ర రాయ్ అనే రైతు తన భార్యతో కలిసి జీవనం సాగించేవాడు.అతని భార్య పేరు తులసీరాణి.20 ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది.భార్యంటే దులాల్ చంద్రకు ఎంతో ప్రేమ.

TeluguStop.com - భార్య కలలోకి వచ్చిన ఏనుగు.. నిజం చేసిన భర్త-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆమె ఏం కోరినా కాదనకుండా తెచ్చి ఇచ్చేవాడు.సంవత్సరం క్రితం తులసీ రాణి కలలోకి ఏనుగు వచ్చింది.

ఆమె తనకు ఏనుగు కొని ఇవ్వాలని భర్తను కోరింది.భార్య ప్రేమగా అడగడంతో భర్త అందుకు అంగీకరించాడు.
అయితే అతను సామాన్య రైతు కావడంతో ఏనుగును కొనేంత డబ్బు అతని దగ్గర లేదు.దీంతో చివరకు తన పొలంలో కొంత భాగాన్ని అమ్మి దులాల్ చంద్ర 16.5 లక్షల రూపాయలు ఖర్చు చేసి మౌల్వీ బజార్ అనే ప్రాంతానికి వెళ్లి ఏనుగును కొనుగోలు చేశాడు.17,000 రూపాయలు చెల్లించి ట్రక్కులో ఏనుగును ఇంటికి తీసుకొని వచ్చాడు.ఏనుగు కోసం పూర్తి సమయం కేటాయించడానికి 15,000 రూపాయల వేతనంతో మావటివాడిని కూడా మాట్లాడుకున్నాడు.
దులాల్ చంద్ర గతంలో భార్య కలలోకి వచ్చిన హంస, మేక, గుర్రంలాంటి జంతువులను కూడా కొనుగోలు చేసి ఇచ్చాడు.

భార్య కలను నెరవేర్చటానికి ఏనుగును కొన్న వ్యక్తిని తొలిసారి చూశామని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.దులాల్ సింగ్ భవిష్యత్తులో భార్య మరేదైనా జంతువును కోరితే దానిని కూడా కొనిస్తానని చెబుతుండటం గమనార్హం.

#Tulasi Laxmi #Elephant #Bangladesh #Husband #Gifted Elephant

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Husband Sells Land Buys Elephant To Fulfill Wife Dream Related Telugu News,Photos/Pics,Images..