తరగతి గదిలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలి పై భర్త పైశాచికం.. ?

సమాజంలో జరుగుతున్న దారుణాలకు అంతే లేదు.మనుషులు కిరాతకంగా, కౄరంగా మారి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు.

 Husband Satanic On Teacher Teaching Lessons In Classroom-TeluguStop.com

అయిన వారిని, కన్న వారిని అని కూడా చూడటం లేదు.ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో స్కూల్ లో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయురాలి పై ఆమె భర్త కత్తితో దాడిచేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

 Husband Satanic On Teacher Teaching Lessons In Classroom-తరగతి గదిలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలి పై భర్త పైశాచికం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి మండలానికి చెందిన దుర్గాప్రసాద్ కు 2016లో నాగలక్ష్మి అనే మహిళతో వివాహం జరిగిందట.

కాగా ఈ క్రమంలో వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉందట.అయితే గత కొంతకాలంగా దుర్గాప్రసాద్ తో మనస్పర్థలు రావడంతో నాగలక్ష్మి వేరే ఉంటుందట.

ఈ నేపధ్యంలో భార్యపై కక్ష పెంచుకున్న దుర్గాప్రసాద్ క్లాస్ రూంలో విద్యార్ధులకు పాఠాలు చెపుతున్న నాగలక్ష్మి పై కత్తితో దాడి చేశాడు.ఊహించని ఈ పరిణామానికి విద్యార్థులు కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారట.

కాగా ఇతని దాడిలో గాయపడిన నాగలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ఆసుపత్రిలో చేర్పించారని సమాచారం.

#Husband #Stabbing #Classroom #Teacher

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు