“భార్యని రేప్ చేసిన భర్త ”...చివరికి భార్యకి ఉరిశిక్ష వేసిన కోర్టు       2018-05-13   05:04:28  IST  Raghu V

ఈ సంఘటన సూడాన్ లో జరిగింది..19 ఏళ్ల యువతికి తనకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా ఒక వ్యక్తికీ ఇచ్చి పెళ్ళిచేశారు ఆ యువతి తల్లి తండ్రులు..అయితే అత్తవారింటికి వెళ్ళినా సరే మళ్ళీ పుట్టింటికి తిరిగి వచ్చేసింది ..దాంతో తన భర్త వచ్చి మళ్ళీ ఆమెని బ్రతిమిలాడుకుని పెద్దల ద్వారా తన ఇంటికీ తీసుకుని వెళ్ళాడు..ఈ సమయంలో వీరిద్దరికీ శోభనం ఏర్పాటు చేశారు..అయితే ఆమె మాత్రం ససేమిరా అన్నది. దాంతో ఆమెను దారిలోకి తెచ్చుకునేందుకు ఆరు రోజుల పాటు ఆ యువకుడు ఎదురుచూశాడు.

అయితే ఎంతగా ఎదురు చూస్తున్నా ఆమె ఒప్పుకోక పోవడంతో తన భండువులని పిలిచి ఆమెని పట్టుకోమని చెప్పి ఆమె పై బలవంతంగా అత్యాచారం చేశాడు..ఆమె తనకు ఇష్టం లేదని మొత్తుకుంటున్నా అతడు మాత్రం వదల్లేదు. మళ్లీ రెండో రోజు కూడా అలాగే చేసేందుకు బంధువులను పిలిచాడు. ఇంతలోనే ఆమె తన భర్తపై కోపంతో దాడి చేసింది ఈ దాడిలో అతడు చనిపోయాడు..

ఈ పరిణామానికి అంతా షాకయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కోర్టు విచారించింది…అయితే సూడాన్ పద్దతుల ప్రకారం మహిళలు పురుషులకి ఎదురు చెప్పకూడదు పైగా అతడిని ఆమె హత్య చేసింది అనే కారణంగా ఆమెకి మరణ దండన విధించారు.. ఐతే ఆమె తల్లిదండ్రులు తన బిడ్డకు ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకు ఆవేదన వ్యక్తం చేస్తూ తనను తను కాపాడుకునేందుకు ఇలా ప్రవర్తించిందనీ, ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోర్టుకు విన్నవించుకున్నారు.

అయితే ఒక స్త్రీకి స్వేచ్చగా బ్రతికే హక్కులని సూడాన్ ప్రభుత్వం కాలరాసున్న ఎవరూ నోరు మెదపక పోవడం ఎంతో దారుణమని..మేము ఎన్నో రకాలుగా నిరసనలు తెలిపినా దీనిపై అంతర్జాతీయంగా నిరసనలు వచ్చినా ఆ దేశం మాత్రం పట్టించుకోవడంలేదని స్వచ్చంద సంస్థలు నిరసనలు తెలుపుతున్నాయి.