భార్యకు పెళ్లి కొడుకు కావాలని మ్యాట్రిమొనిలో పెట్టిన భర్త.. చివరికి..!

Husband Put Wife Details In Matrimony

ఒక భర్త తన భార్యకు పెళ్లి కొడుకు కావాలని మ్యాట్రిమొని సైట్ లో తన భార్య డీటెయిల్స్ పెట్టాడు.ఇంతటి ఘానా కార్యం చేయడానికి కారణం ఏంటో తెలిస్తే మీరు కూడా అతడిని అసహ్యించు కుంటారు.

 Husband Put Wife Details In Matrimony-TeluguStop.com

ఇంతకీ అతడు అలా ఎందుకు చేసాడో తెలుసా.భార్య భర్తలు ఇద్దరు మనస్పర్థల కారణంగా విడిపోవాలని నిర్ణయించు కున్నారు.

విడాకుల కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కారు.

 Husband Put Wife Details In Matrimony-భార్యకు పెళ్లి కొడుకు కావాలని మ్యాట్రిమొనిలో పెట్టిన భర్త.. చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరి విడాకుల కేసు ఇంకా విచారణ జరుగుతూ ఉండగానే ఆ భర్త భార్య మీద కోపంతో ఆమె వివరాలను మ్యాట్రిమొని సైట్ లో పెట్టాడు.

తన భార్యకు వరుడు కావాలి అని మ్యాట్రిమొని సైట్ లో పెట్టడంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది.పోలీసులు చెబుతున్న వివరాలు ప్రకారం.

తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు కు చెందిన యువతికి పంచాయతీ అధ్యక్షుడు సురేష్ బాబు కుమారుడు ఓం కుమార్ కు 2016లో వివాహం జరిగింది.

వీరికి ఐదు సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు.

అయితే గత కొంత కాలంగా మనస్పర్థలు రావడంతో విడిపోవాలని అనుకున్నారు.విడాకులు కావాలని ఓం కుమార్ కోర్టుకు వెళ్ళాడు.

ప్రెసెంట్ ఈ కేసు విచారణ సాగుతుంది.అయితే భార్యపై కోపం తో అతడు రెండు వారాల క్రితం ప్రముఖ మ్యాట్రిమొని లో వరుడు కావాలి అని ఆమె వివరాలతో సహా పెట్టి ఆసక్తికర వ్యక్తులు ఆమె తండ్రిని సంప్రదించాలని పెట్టాడు.

అతడు మ్యాట్రిమొని సైట్ లో ఆమె వివరాలతో సహా పెట్టడంతో ఆమె తండ్రికి ఫోన్ కాల్స్ వస్తున్నాయట.దీంతో ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదులో ఆమె తన భర్త ఓం కుమార్ తన వివరాలను మ్యాట్రిమొని లో ఉంచాడని తెలిపింది.దీంతో పోలీసులు ఓం కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

#Matrimony #Kadambathuru #Tiruvalluru #Matrimony

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube