టిక్‌టాక్‌ : తన మాట కాదని వీడియోలు పెడుతున్న భార్యను భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్‌ అవుతారు  

Husband Murders Wife For Doing Tiktok -

ప్రస్తుతం ఇండియాలో ఏం నడుస్తుందంటే ఠక్కున వినిపించే పేరు టిక్‌ టాక్‌.ఇండియా వ్యాప్తంగా యువతి యువకులు మాత్రమే కాకుండా పెద్ద వారు కూడా టిక్‌టాక్‌లో మునిగి పోయారు.

Husband Murders Wife For Doing Tiktok Videos

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లలో టిక్‌టాక్‌కు ఇండియాలోనే అత్యధికులు ఉన్నారు.సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు మార్పు కోరుకుంటూ ఉన్న ఇండియన్‌ నెటిజన్స్‌ ప్రస్తుతం టిక్‌ టాక్‌ వెంట పడుతున్నారు.

టిక్‌ టాక్‌ ఇండియాలో విపరీతంగా వాడుతుంటే, తమిళనాడులో అంతకు మించి వాడుతున్నారని చెప్పుకోవాలి.అందుకే తమిళనాడు ప్రభుత్వం టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయాలని భావించింది.

టిక్‌టాక్‌ : తన మాట కాదని వీడియోలు పెడుతున్న భార్యను భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్‌ అవుతారు-General-Telugu-Telugu Tollywood Photo Image

బ్యాన్‌ చేసింది కూడా, కాని సుప్రీం కోర్టులో టిక్‌టాక్‌ బ్యాన్‌ సాధ్యం కాలేదు.

టిక్‌టాక్‌ను తమిళ జనాలు ఏ స్థాయిలో ఉపయోగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పటికే టిక్‌ టాక్‌ పేరుతో చాలా మంది మృత్యువాత పడ్డారు.పలువురు తమిళ యూజర్లు ఏదో ఒక సమయంలో ఇబ్బందులు పడుతున్నారు.

అయినా కూడా తమిళనాడులో మాత్రం టిక్‌టాక్‌ వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు.తాజాగా మరో దారుణం జరిగింది.

తమిళనాడు కోయంబత్తూర్‌కు చెందిన తాపీ మేస్త్రీ కనకరాజ్‌ భార్య నందిని.ఇద్దరి మద్య కొన్ని వారాల క్రితం గొడవలు జరగడంతో నందని పుట్టింటికి వెళ్లింది.

పుట్టింటికి వెళ్లిన నందిని టిక్‌టాక్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తూ వచ్చింది.ఆ వీడియోలపై కనకరాజ్‌ ఆగ్రహం చేస్తూ వచ్చాడు.

అశ్లీల వీడియోలు పోస్ట్‌ చేయవద్దని వారించాడు.అయినా కూడా ఆమె ఒప్పుకోలేదు.

స్నేహితుల ముందు పరువు పోతుందని ఆమెను వేడుకున్నా కూడా వినిపించుకోలేదు.శృతిమించి మరీ అశ్లీల వీడియోలను పోస్ట్‌ చేయడం ప్రారంభించింది.దాంతో కనకరాజ్‌ ఓపిక నశించింది.ఆమె పని చేస్తున్న కాలేజ్‌ వద్దకు వెళ్లి ఆమెను కలుసుకున్నాడు.మద్యం మత్తులో ఉన్న కనకరాజ్‌ ఆమెను బెదిరించాడు వీడియోలను డిలీట్‌ చేసి మరో సారి వీడియోలను పోస్ట్‌ చేయను అంటూ చెప్పమన్నాడు.కాని ఆమె మాత్రం అందుకు అంగీకరించలేదు.

దాంతో నందినిని తన వద్ద ఉన్న కత్తితో పొడిచాడు కనకరాజ్‌.

వెంటనే కాలేజ్‌ సిబ్బంది ఆమెను హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు.కాని అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైధ్యులు నిర్ధారించారు.పోలీసులు కేసు నమోదు చేసి కనకరాజ్‌ను అరెస్ట్‌ చేశారు.

భార్య భర్తల మద్య ఇలాంటివి చిన్న చిన్న విషయాలు కామన్‌గా వస్తాయి.అంత మాత్రానికే ఇంత పని చేయాలా అంటూ కనకరాజ్‌పై నందిని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు