నటుడి పై అభిమానం ప్రాణాలనే బలి తీసుకుంది  

Husband Murders His Wife For Crushing On Hrithik Roshan-

సినీ నటులను ఇష్టపడం సాధారణమే, అయితే ఆ అభిమానమే ఒక వివాహిత ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.ఈ దారుణ ఘటన న్యూయార్క్ లో చోటుచేసుకుంది.

నటుడి పై అభిమానం ప్రాణాలనే బలి తీసుకుంది-Telugu Trending Latest News Updates-Husband Murders His Wife For Crushing On Hrithik Roshan-

న్యూయార్క్ లోని అక్కడి క్వీన్స్ లో హోమ్ లో ఉండే దినేశ్వర్ బుది దత్(33) అనే వ్యక్తి తన భార్య డోన్నీ దొజాయ్(27) ని హతమార్చినట్లు తెలుస్తుంది.ఈ ఏడాది జూలై లో వీరి వివాహం జరుగగా వివాహం అయిన కొద్దీ రోజులకే దొజాయ్ ను వేధించడం మొదలుపెట్టాడు.అయితే హృతిక్ రోషన్ ని ఇష్టపడుతున్న కారణంగా తట్టుకోలేకనే ఆమె ప్రాణాలను తీసి, అనంతరం అతడు కూడా చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.

భార్య దొజాయ్ ను కత్తితో పొడిచి చంపేసిన అనంతరం దినేశ్వర్ సోదరికి మెసేజ్ చేసినట్లు తెలుస్తుంది.డోన్నీ ని చంపేశాను,ఇంటి తాళాలు డోర్ దగ్గరున్న ఫ్లవర్ పాట్ లో పెట్టినట్లు మెసేజ్ లో పెట్టాడు.

ఆ తరువాత దగ్గరలోని ఒక చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంఘటనపై దొజోయ్ ఆంటీ మాట్లాడుతూ ఆమె చాలా మంచిదని బాగా కష్టపడేతత్వం ఉన్న అమ్మాయి కానీ అతడే ఓ పిరికిపంద ఆమెను చంపే హక్కు అతడికి లేదు అని భావోద్వేగానికి గురైంది.అయితే డోన్నీ హృతిక్‌కు పెద్ద అభిమాని అని అతడి ప్రతి సినిమా ను కూడా వదలకుండా చూస్తుంది అని తెలిపారు.

ఇక ఆమె సన్నిహితులు సైతం దినేశ్వర్ గురించి డోర్నీ తమ దగ్గర అప్పుడప్పుడు చెప్పేదని ఆమె ఉద్యోగం చేయడం కూడా అతడికి నచ్చేది కాదని చెప్పుకొచ్చారు.కానీ ఎన్నో ఆశలతో పెళ్లి బంధం లోకి అడుగుపెట్టిన డోన్నీ కి ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు.

జీవితాంతం తోడుగా నీడగా ఉండి కాపాడాల్సిన భర్తే ఆమెను కడతేర్చాడు.