ఏడాది నుంచి భార్యను టాయిలెట్ లో బంధించిన భర్త!  

Husband Locked wife in Toilet From One Year, Husband , Toilet, Locked, Mmental Condition, - Telugu Husband Who Locked His Wife, In The Toilet Fro, Local Civil Hospital For Treatment, M The Year, Mental Condition Was Not Good, Women And Child Welfare Department Officials

భార్య, భర్తల మధ్య సాధారణంగా చిన్న చిన్న గొడవలు తలెత్తుతూ ఉంటాయి.ఆ గొడవలు కాస్త పెద్దగా మారితే విడాకుల దాకా వెళతాయి.

TeluguStop.com - Husband Locked His Wife In The Toilet From The Year

విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు జీవిస్తూ ఉంటారు.ఇంకా కొందరిఆరోగ్యం బాగా లేకపోతే అప్పోసప్పో చేసి మంచి చికిత్స తీసుకుంటూ ఉంటారు.

కానీ తన భార్య మానసిక పరిస్థితి బాగాలేదని భర్త తన భార్యను ఏం చేశాడో తెలుసా? తన భార్యను ఏకంగా ఏడాదిపాటు టాయిలెట్ లో బంధించాడు.ఈ హృదయ విదారక ఘటన హర్యానా రాష్ట్రంలోని, పానిపట్ జిల్లాలో చోటు చేసుకుంది.

TeluguStop.com - ఏడాది నుంచి భార్యను టాయిలెట్ లో బంధించిన భర్త-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…
హర్యానారాష్ట్రంలోని ,పానిపట్ జిల్లా,రిష్పూర్ గ్రామంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది.తన భార్య మానసిక పరిస్థితి బాగాలేదని ఆ భర్త ఆమె పట్ల కఠినంగా వ్యవహరించారు.

మానసిక పరిస్థితి బాగోలేనప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాల్సిన భర్త ఆమెను ఎంతో కఠినంగా శిక్షించాడు.అపరిశుభ్రంగా ఉండే ఓ చిన్నపాటి మరుగుదొడ్డి లో ఆమెను బంధించాడు.

ఒకటి కాదు ,రెండు రోజులు కాదు ఏకంగా ఒక సంవత్సరం పాటు ఆమెను టాయిలెట్ లో బంధించాడు.ఈ విషయం తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెను రక్షించారు.

అయితే ఆమె ఎంతో నీరసంగా, బలహీనంగా, నడవలేని స్థితిలో ఉందని అధికారులు తెలియజేశారు.ఆమెను బంధించిన భర్తపై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రజనీ గుప్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బలహీనంగా ఉన్న ఆమెను అధికారులు చికిత్స నిమిత్తం స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించారు.టాయిలెట్ లో బంధించబడి ఉన్న ఆమెకు సరైన ఆహారం, నీరు ఇవ్వకపోవడంతో చాలా బలహీనంగా తయారయిందని అధికారులు తెలియజేశారు.

వీరికి ముగ్గురు సంతానం కాగా వారి వయసు 15,13,11 సంవత్సరాలు గల పిల్లలు ఉన్నారు.భార్యను బంధించిన భర్త నరేష్ పై ఐపీసీ సెక్షన్498 ఏ,342 కింద కేసు నమోదు చేశామని స్థానిక పోలీసు అధికారులు తెలియజేశారు.

#WomenAnd #LocalCivil #M The Year #MentalCondition #HusbandWho

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Husband Locked His Wife In The Toilet From The Year Related Telugu News,Photos/Pics,Images..