భార్యను పసుపు తాడుతో చంపిన భర్త..!

కట్టిన తాళే యమపాశం అయింది ఓ మహిళకు.మద్యానికి బానిసైన భర్త చేతిలో హతమైంది.

 Husband Kills Wife-TeluguStop.com

అనుమానం అనే రోగంతో రోజు నరకయాతన పెట్టి.మారిపోయానని నమ్మబలికాడు.

మెట్టినింటికి తీసుకొచ్చి విశ్వరూపం చూపించాడు.పసుపుతాడును మెడకు గట్టిగా బిగించి ప్రాణాలు తీశాడు ఈ కిరాతకుడు.

 Husband Kills Wife-భార్యను పసుపు తాడుతో చంపిన భర్త..-Telugu Crime News(క్రైమ్ వార్తలు)-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ అమానుష ఘటన పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో చోటు చేసుకుంది.

ఏలూరు డీఎస్సీ దిలీప్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.దేవరపల్లికి చెందిన మేడా అబ్బులు అనే వ్యక్తి గణపవరానికి చెందిన నంగాలమ్మను రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.

వీరిద్దరికీ 9 నెలల బాబు ఉండగా ఆమె నాలుగు నెలల గర్భవతి.అయితే అబ్బులు మద్యానికి బానిసవడంతో రోజు నంగాలమ్మను కొట్టేవాడు.

భరించలేక రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.దీంతో అబ్బులు ప్రవర్తన మార్పు వచ్చింది.

పిప్పరలోని ఒక చేపల చెరువులో పనికి చేరి, భార్య దగ్గరికి వెళ్లి ఇంకెప్పుడు వేధించననంటూ మెట్టినింటికి తీసుకొచ్చాడు.కాగా, ఈ నెల 18వ తేదీన రాత్రి అబ్బులు మద్యం సేవించాడు.

దీంతో ఇరువురి మధ్య గొడవ పెరిగింది.కోపంలో భార్య మెడలో ఉన్న తాళితో గట్టిగా మెడకు బిగించి, బీరు బాటిల్ తో గొంతులో పొడిచాడు.

ఆ తర్వాత ఆమెను చికిత్సకు ఆస్పత్రికి తరలించి తన తమ్ముడి ఇంటికి వెళ్లాడు.పోలీసులకు వైద్యులు సమాచారం అందించడంతో గణపవరం ఎస్ఐ నిందితుడు అబ్బులుని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించాడు.

#Kills #Husband #Wife

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు