మ‌గాడు మృగాడిగా మారిపోతున్నాడు

మ‌గాడు మృగాడిగా మారిపోతున్నాడు.వ‌రుస‌లు మ‌ర‌చి అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్నాడు.

 Husband Kills His Wife Brutally In Hyderabad-wheare The Humanity ?-TeluguStop.com

అనుమాన‌పు తీరాలు దాటి అమానుషంగా ఆడ‌దాన్ని చంపేస్తున్నాడు.మాన‌వ‌త్వం మంట‌గ‌లుస్తున్న ఈ ఘ‌ట‌న‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టి స్తున్నాయి.

8 ఏళ్ల క్రితం సింథియా ని ప్రేమించి వివాహం చేసుకుని హైదరాబాద్‌లోవ్యాపారం చేసున్న రూపేష్ వ్యాపారంలో న‌ష్టాల‌కు మాన‌సికంగా కృంగిపోయి నిత్యం భార్య‌తో గొడ‌వలు ప‌డుతూ, కోపంతో చంపి ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి పెట్రోల్ పోసి త‌గ‌లెట్టేసాడు.అంత‌కు ముందు కొత్త‌గా పెళ్ల‌యిన త‌న కుమార్తెను ఆషాడ మాసం కోసం పుట్టింటికి తీసుకువ‌స్తు, కూతురిని త‌న కోర్కె తీర్చాల‌న్న మార్గ‌మ‌ధ్య‌లో హూంక‌రించి, చీర‌తోనే ఆమెకు ఉరేసిన తం్ర‌డి మ‌ల్ల‌య్య‌.

ఇక త‌మిళ‌నాట సంచ‌ల‌నం సృష్టించిన ఇన్ఫోసిస్ ఇంజ‌నీర్ స్వాతి హ‌త్య‌కు కార‌కుడైన రామ్‌కుమార్ నోట వినిపించిన మాట‌లు స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేవే.ఇవి కాక అడ‌పా ద‌డ‌పా ్ర‌ప‌పంచ‌మే తెలియ‌ని చిన్నారుల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే ఈ స‌మాజంలో మాన‌వ‌త్వం మంట‌గ‌లిసిపోతోంద‌న్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు.

క్ష‌ణికావేశంలో చేస్తున్న అకృత్యాలు కొన్ని కుటుంబాల స్ధితి గ‌తుల‌నే మార్చేస్తోంది.ఇలా స‌మాజంలో చెల‌రేగుతున్న ఘ‌ట‌న‌ల‌న్ని ఆందోళ‌న‌లు క‌లిగించేవేలే,,, ఈ మ‌నిషిలో మార్పు ఎన్న‌డొస్తుందో ఏమో?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube