విడ్డూరం : భార్యను చంపాడు, తాను చావాలనుకున్నాడు.. కాని తిరుమల వెంకటేషుని దర్శించుకుని..!

ఒక సారి అనుమానం అనేది మొదలైంతే అది చచ్చే వరకు ఉంటూనే ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అనుమానంతో ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి.

 Husband Killed Wife In Kurnool-TeluguStop.com

ఎంతో మంది భార్య భర్తలు చనిపోయారు.కొన్ని కుటుంబాలు దిక్కులేకుండా అయ్యాయి.

పలు కుటుంబాల నాశనంలో అనుమానం అనేది అత్యంత దారుణమైన పాత్రను పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.పెళ్లి అయ్యి పాతిక సంవత్సరాలు సంతోషంగా జీవితాన్ని గడిపిన ఒక జంట అనుమానంతో తమ సంసారంను నాశనం అయ్యేలా చేసుకున్నారు.

భర్త అనుమానంతో భార్య జీవితంను చాలించాలనుకుంది.కాని ఆమెను కాపాడి, ఆ తర్వాత చంపేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్లు గ్రామానికి చెందిన వీరశేఖర్‌, పావనిలకు 25 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది.పెళ్లి అయిన ఇన్నేళ్ల వరకు బాగానే ఉన్నారు.

అయితే ఇటీవల వీరశేఖర్‌కు పెళ్లికి ముందు పావని ఒక వ్యక్తిని ప్రేమించిందని, ఆ వ్యక్తి ప్రస్తుతం ఎమ్మిగనూరులోనే ఉంటున్నాడని తెలుసుకున్నాడు.అప్పటి నుండి కూడా అతడు అనుమానంతో రగిలి పోతున్నాడు.

మళ్లీ మళ్లీ అతడితో తన భార్య పావని కలుస్తుందనే అనుమానం వీరశేఖర్‌కు కలుగుతోంది.ఆ సమయంలోనే పావని మాజీ ప్రియుడు అప్పుడప్పుడు అతడికి ఎదురవ్వడం, ఇద్దరు కలిసి వెళ్తున్న సమయంలో ఎదురవ్వడం జరిగింది.

దాంతో అతడి అనుమానం మరింతగా పెరిగింది.

విడ్డూరం : భార్యను చంపాడు, తాన�

అతడు కనిపించిన ప్రతి సారి కూడా ఆమెను తీవ్రంగా కొట్టేవాడు.ఇక భార్యపై అనుమానంతో ఇంట్లోని వాల్‌ క్లాక్‌లో సీసీ కెమెరాను పెట్టించాడు.అందుకోసం రెండు లక్షల రూపాయలను అప్పుగా చేశాడు.

ఆ అప్పును చెల్లించేందుకు పావని బంగారం ఇవ్వమని గొడవ చేశాడు.ఆమె అందుకు అంగీకరించలేదు.

భర్త అనుమానించడంతో పాటు, బంగారంను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆమెకు జీవితంపై విరక్తి కలిగింది.దాంతో భర్త ఇంట్లో బాత్‌ రూంలో ఉన్న సమయంలో పావని ఫ్యాన్‌కు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది.

అలికిడి విన్న వీరశేఖర్‌ వెంటనే భార్యను కాపాడి హాస్పిటల్‌కు తీసుకు వెళ్లి బాగు చేయించాడు.

విడ్డూరం : భార్యను చంపాడు, తాన�

పావని అంతా సెట్‌ అయ్యింది.ఆ తర్వాత ఆమెను కాపాడి తప్పు చేశానని భావించాడు.దాంతో ఆమెను దిండుతో మొహంపై బలంగా ఉపిరి ఆడకుండా చేసి చంపేశాడు.

పావనిని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా వాట్సప్‌ ద్వారా కుటుంబ సభ్యులకు మెసేజ్‌ పెట్టాడు.చనిపోయే ముందు తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నాడు.వెంకటేశుని దర్శించుకున్న తర్వాత చనిపోవాలనే ఆలోచన వదిలేశాడు.పోలీసులకు లొంగిపోయి అసలు విషయం చెప్పాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు వీర శేఖర్ ను అరెస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube