పెళ్లి వేడుకలో డాన్స్‌ చేసిందని భార్యను ఏం చేశాడో తెలుసా.. ఇంతటి దుర్మార్ఘులు కూడా ఉంటారా?  

Husband Killed Wife For Dancing In Marriage-husband,marriage,reception,దుర్మార్ఘులు,పెళ్లి వేడుక,బీహార్‌

ఉత్తర భారతదేశంలో పాశ్చత్య పోకడలు విపరీతంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లోనే అత్యంత దారుణమైన మూడ నమ్మకాలు, పిచ్చి నమ్మకాలు ఉంటాయి. ఉత్తరాదిన ఎంతో మంది మూడ నమ్మకాల వల్ల, పరువు అంటూ హత్య కావించబడుతున్నారు..

పెళ్లి వేడుకలో డాన్స్‌ చేసిందని భార్యను ఏం చేశాడో తెలుసా.. ఇంతటి దుర్మార్ఘులు కూడా ఉంటారా?-Husband Killed Wife For Dancing In Marriage

అత్యంత దారుణమైన పరిస్థితులు మరియు పరిణామాల మద్య తాజాగా మరో సంఘటన జరిగింది. బీహార్‌లో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఒక వివాహ వేడుకలో పాల్గొని డాన్స్‌ వేసినందుకు ఏకంగా ప్రాణాలే పోగొట్టుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… బీహార్‌లోని పట్నా జిల్లా హసది ముషారి ప్రాంతంలో ఒక పెళ్లి వేడుక జరిగింది. ఆ పెళ్లి వేడుకకు బంధువులుగా రంజిత్‌ మాంఝీ, మునియా దేవి అనే దంపతులు వెళ్లారు. అప్పటి వరకు ఇద్దరు కూడా చాలా సరదాగా పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. వారిద్దరు పెళ్లి కార్యక్రమంలో హడావుడి చేశారు.

పెళ్లి అంతా పూర్తి అయ్యింది. ఆ తర్వాత కార్యక్రమాలు జరుగుతున్నాయి. రంజిత్‌ ఏదో పనిమీద బయటకు వెళ్లాడు..

ఆ సమయంలోనే పెళ్లికి సంబంధించిన భరాత్‌ ప్రారంభం అయ్యింది. పెళ్లి భరాత్‌లో ఆడవారు చాలా మంది డాన్స్‌లు వేస్తున్నారు. సరదాగా ఒకరిని లాక్కుంటూ మరొకరితో డాన్స్‌లు వేయడం జరిగింది.

ఆ సమయంలోనే మునియా దేవి కూడా ఇతరుల బలవంతం మీద డాన్స్‌ వేసింది.

మునియా దేవి డాన్స్‌ వేసిన విషయం ఎవరి ద్వారానో రంజిత్‌కు తెలిసింది. దాంతో వెంటనే అతడికి తీవ్రమైన ఆగ్రహం పెళ్లుబికింది. అతడు కోపంను ఆపుకోలేక పోయాడు.

ఆమె తన పరువు తీసిందని భావించాడు. పరాయి పురుషుడితో డాన్స్‌ వేసిందని అతడి కోపం వచ్చింది. అదే కోపంతో వేడుక వద్దకు వచ్చిన రంజిత్‌ ఆమెను విచక్షణ రహితంగా కొట్టాడు..

దాంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఎంత మంది అడ్డు వచ్చినా కూడా అతడు వదల్లేదు. అందరికి దూరంగా పశువుల పాకలోకి లాక్కుని వెళ్లి రాళ్లతో కొట్టి చంపేశాడు.

ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. క్షనికావేశంలో అతడు చేసిన పనికి రెండు జీవితాలు నాశనం అయ్యాయి. అందుకే ఎంత కోపం ఉన్నా కాస్త ఆలోచన చేయాలని పెద్దలు అంటారు.