భార్యను చంపి.. అరెస్ట్ చేయండి అంటూ పోలీసులకు ఫోన్ చేసిన ప్రబుద్ధుడు..

రోజురోజుకూ హత్యలు ఎక్కువవుతున్నాయి.ప్రతి చిన్న కారణాలకు హత్య చేయడం చాలా మామూలు విషయంగా మారిపోతుంది.

 Husband Killed His Wife In Mahabubabad-TeluguStop.com

క్షణికావేశంలో హత్యలు చేసి ఆ తర్వాత ఏమి చేసిన ఫలితం ఉండదు.అలాంటి ఘటనే తెలంగాణాలో జరిగింది.

ఒక వక్తి భార్యను అనుమానంతో చంపేశాడు.చంపి పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పాడు.

 Husband Killed His Wife In Mahabubabad-భార్యను చంపి.. అరెస్ట్ చేయండి అంటూ పోలీసులకు ఫోన్ చేసిన ప్రబుద్ధుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఒక ప్రబుద్దుడు భార్యను చంపి.ఆ తర్వాత 100 కు డయల్ చేసి నేను న భార్యను చంపేసా.

నేను ఇక్కడే ఉంటా.నన్ను అరెస్ట్ చేయండి.

అని పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఒక్కసారి ఖంగు తిన్నారు.మహబూబాబాద్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది.

భార్యపై అనుమానంతో ఆమెను చంపినట్లు తెలుస్తుంది.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండకు చెందిన నరేష్ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు.

తర్వాత చిననగూడూరు మండలం జయ్యారానికి చెందిన సరితతో రెండవ పెళ్లి చేసుకున్నాడు.వీరి వివాహం జరిగి 12 సంవత్సరాలు అయ్యింది.

వీళ్ళకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.పెద్ద కూతురు సిరివెన్నెల 10 సంవత్సరాలు, చిన్న కూతురు మేఘన 6 సంవత్సరాలు.

డ్రైవర్ గా పనిచేస్తున్న నరేష్ కొద్ది రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు.అనుమానంతో ఎప్పుడు గొడవ పడుతుండేవాడు.

ఒక రోజు జరిగిన గొడవలో సరిత తీవ్రంగా గాయపడింది.ఇంకా భరించలేక ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళింది.

అయితే కొన్ని రోజుల తర్వాత సరిత వాళ్ళ పుట్టింటికి వెళ్లిన నరేష్ ఇంకా ఎప్పుడు గొడవలు పడనని చెప్పి ఆమెను నమ్మించాడు.భర్త చెప్పిన మాటలను నమ్మిన సరిత చిన్నకూతురును వెంటబెట్టుకుని భర్తతో కలిసి మహబూబాబాద్ కు వెళ్ళిపోయింది.అక్కడ నుండి భార్యను, కూతురుని బైక్ మీద అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కూరును దూరంగా ఉండమని చెప్పి ఆమెను పక్కకు తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి హత్య చేసాడు.

తర్వాత పోలీసులకు ఫోన్ చేసి నా భార్యను చంపేశా.

వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లండి.నేనెక్కడికి పారిపోను.

ఇక్కడే ఉంటా.అని నరేష్ ఫోన్ లో పోలీసులకు చెప్పాడు.

పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళేలోపు చెప్పినట్టుగానే నరేష్ అక్కడే కూర్చుని ఉన్నాడు.పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

#HusbandKilled #Mahabubabad #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు