భార్యతో కలిసి ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు..విచారణలో విస్తుపోయే నిజాలు..!

ఇటీవలే కాలంలో వివాహేతర సంబంధాలన్నీ చివరకు దారుణ హత్యలతో ముగుస్తున్నాయి.వివాహం తర్వాత జీవిత భాగస్వామిని మోసం చేసి చాలామంది వివాహేతర సంబంధాలు( Illegal Affairs ) పెట్టుకుని చివరకు కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

 Husband Killed Girl Friend With The Help Of Wife In Odisha Details, Husband, Kil-TeluguStop.com

ఓ వ్యక్తి తనకు వివాహం అయిన సంగతి దాచిపెట్టి ఓ యువతికి ప్రేమ పేరుతో దగ్గర పెళ్లి చేసుకుంటానని నమ్మించి దారుణంగా మోసం చేశాడు.ఆ యువతి పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిలదీయడంతో తన భార్య సహాయంతో ఆ ప్రియురాలిని( Girl Friend ) హతమార్చిన ఘటన ఒడిశాలోని నవరంగాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

నవరంగాపూర్ జిల్లాలోని భాఘబెడ గ్రామానికి చెందిన తిలాబతి గండ్ (23) అనే యువతికి బారసుండి గ్రామానికి చెందిన చంద్ర రౌత్( Chandra Raut ) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.

పెళ్లి చేసుకుంటానని ఆ యువతికి మాయమాటలు చెప్పి, ఆ యువతికి దగ్గరయ్యాడు.వీరిద్దరూ ప్రేమించుకుని చాలా రోజులు గడుస్తున్నా.

ఎప్పుడు పెళ్లి విషయం గురించి ప్రస్తావించిన చంద్రరౌత్ గా స్పందించకపోవడంతో.గత శనివారం యువతి బారసుండి గ్రామంలోని చంద్రరౌత్ ఇంటికి వెళితే, అతనికి వివాహం అయిందన్న విషయం బయటపడింది.

Telugu Chandra Raut, Friend, Navarangapur, Odisha, Siyabati, Tilabati Gund-Lates

విషయం తెలిసిన కూడా ఆ యువతి తనను కూడా పెళ్లి చేసుకోవాలని( Marriage ) చంద్రరౌత్ ను గట్టిగా నిలదీసింది.దీంతో చంద్రరౌత్ భార్య సియాబతి తన భర్తను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు.ముగ్గురు మధ్య మాట పెరిగి పెద్ద గొడవ జరిగింది.తిలాబతి గండ్( Tilabati Gund ) కోర్టును ఆశ్రయిస్తానని బెదిరించడంతో చంద్రరౌత్, సియాబతి భయపడిపోయి ఆ యువతిని చంపాలని నిర్ణయించుకున్నారు.

ఆ యువతీని ఇంటి లోపలికి పిలిచి కత్తితో పొడిచి హత్య చేశారు.ఆ తర్వాత మృతదేహాన్ని అడవిలోకి తీసుకెళ్లి 31 ముక్కలుగా నరికి అ మృతదేహాన్ని పాతిపెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

తిలాబతి గండ్ కనిపించకపోవడంతో ఆమె తండ్రి లుథూరామ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

Telugu Chandra Raut, Friend, Navarangapur, Odisha, Siyabati, Tilabati Gund-Lates

అయితే చంద్రరౌత్ దంపతులు ఆ యువతిని ముక్కలుగా నరికి అడవిలో పాతి పెడుతుండగా ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చూసి, ఆ విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు.గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం భాగాలని వెలికి తీశారు.శవ పరీక్ష చేసిన తర్వాత అది తిలాబతి గండ్ డెడ్ బాడీ అని తేలింది.

ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఘటన స్థలంలో దొరికిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.పరారీలో ఉన్న చంద్రరౌత్ దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube