అనుమానం, వరకట్న వేధింపులు.. పైసా ఇవ్వకుండా వదిలేసి వెళ్లిన భర్త: అమెరికాలో నవ వధువు దుస్థితి

ఆడపిల్ల ఏ లోటు లేకుండా సుఖపడుతుందని.తమకు కూడా చెప్పుకోవడానికి గర్వకారణంగా వుంటుందనే ఉద్దేశ్యంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఏరి కోరి ఎన్ఆర్ఐ సంబంధాలను వెతుకుతుంటారు.

 Husband Has Abandoned Me: Indian Woman Sos To Embassy In Us , Nri, Bihar, Quanti-TeluguStop.com

ఎన్ఆర్ఐ అల్లుళ్ల బాగోతాలపై ఎన్ని వార్తలు వచ్చినా వీరు మాత్రం మారడం లేదు.భారతదేశంలో వున్నప్పుడు ఎంతో హుందాగా, మంచితనం నటిస్తూ అత్తింటి వారిని నమ్మించే కొందరు ఎన్ఆర్ఐలు.

తీరా పరాయి గడ్డ మీద అడుగుపెట్టిన తర్వాత తమ నిజ స్వరూపాన్ని చూపిస్తూ వుంటారు.భార్యలను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు చిత్రహింసలకు గురిచేస్తూ వుంటారు.

కొందరైతే వీరిని విడిచిపెట్టి మరో పెళ్లి చేసుకుంటున్నారు.ఎంతో కష్టపడి పెంచి, అప్పులు చేసి ఘనంగా పెళ్లి చేసిన తల్లిదండ్రుల పరువు పొకూడదనే ఉద్దేశ్యంతో అమ్మాయిలు ఆ బాధను పంటి బిగువన భరిస్తూ వుంటారు.

అటు కన్నవారికి చెప్పుకోలేక.ఇటు భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

తాజాగా పెళ్లయిన కొద్దిరోజులకే భార్యపై అనుమానంతో తనను వేధించడంతో పాటు అదనపు కట్నం కోసం చిత్రహింసలు గురిచేసిన ఎన్ఆర్ఐ భర్త వ్యవహారం వెలుగుచూసింది.అమెరికాలోని భారత ఎంబసీని ఆశ్రయించిన ఆమె ధీనగాథ కంటతడి పెట్టిస్తోంది.

బీహార్ కు చెందిన ఆ బాధిత నవ వధువు తన భర్తతో కలిసి ఈ ఏడాది మార్చిలో అమెరికాకు వచ్చింది.వర్జీనియాలోని మెక్‌లాన్‌లో వీరు నివసిస్తున్నారు.ఆమె భర్త ఫ్రెడ్డీ మ్యాక్ అనే సంస్థలో క్వాంటిటేటివ్ అనలిటిక్స్ గా పనిచేస్తున్నాడు.అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత ఆమె భర్త నిజస్వరూపం చూపించాడు.

అదనపు కట్నం తీసుకురావాలని వేధించడంతో పాటు దీనికి అనుమానపు పిశాచి కూడా తోడు కావడంతో అతను మరింతగా రెచ్చిపోయాడు.

చివరికి బాత్రూంకు వెళ్లినా భర్త తనపై అనుమానపడేవాడని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది.

గర్భం దాల్చకుండా తానేదో చేస్తున్నాననే అనుమానంతో.బాత్రూంకు వెళ్తే తలుపులు వేయొద్దని వేధించాడని ఆవేదన వ్యక్తం చేసింది.

ఫోన్ వాడనిచ్చేవాడు కాదని, తాముండే ఫ్లోర్ లో కేవలం చెత్త వేయడానికి మాత్రమే ఒంటరిగా వెళ్లనిచ్చేవాడని వాపోయింది.ఓరోజు రోడ్డు మీద వెళ్తుండగా తనను మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణ చెప్పించుకున్నాడని బాధితురాలు తెలిపింది.

Telugu Bihar, Visa, Floor, June Virginia-Telugu NRI

కనీసం పైసా కూడా ఇవ్వకుండా తనను వదిలేసి వెళ్లాడని, ఎటు వెళ్లాలో తనకు తెలియట్లేదని ఆమె వాపోయింది.భర్త విషయాన్ని తన అత్తమామలకు తెలియజేసినా.తనను భారత్ కు తీసుకురావాలంటే అదనపు కట్నం తీసుకురావాల్సిందేనని చెప్పినట్లు ఆరోపించింది.ఆ వేధింపులు భరించలేక తాను వర్జీనియా పోలీసులకు జూన్ 15న ఫిర్యాదు చేశానని చెప్పింది.

పోలీసులు అతడిపై క్రిమినల్ కేసు పెట్టారని తెలిపింది.ఎంబసీతో పాటు భారత ప్రభుత్వ అధికారులు, అమెరికా విదేశాంగ శాఖకూ కూడా ఫిర్యాదు చేసింది.

Telugu Bihar, Visa, Floor, June Virginia-Telugu NRI

మరోవైపు ఫోన్ ద్వారా అతడిని పోలీసులు సంప్రదిస్తే.కావాలని తనను ఇరికించారంటూ ఆరోపిస్తున్నాడు.ఎఫ్ 1 స్టూడెంట్ వీసా కింద అతడు అమెరికాలో ఉంటున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.భార్యకు విడాకుల నోటీసులు పంపించడంతో ప్రస్తుతం బాధిత మహిళ సియాటిల్ లోని బంధువుల ఇంట్లో ఉంటోంది.

అమెరికాలో గృహ హింసను ఎదుర్కొనే మహిళల రక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ సాయంతో ఆమె న్యాయం కోసం పోరాడుతోంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube