మరికొన్ని గంటల్లో శోభనం, అప్పుడే వాంతులు చేసుకున్న పెళ్లి కూతురు.. అంతా రచ్చ రచ్చ  

Husband Doubts Wife And Tests Her-husband,karnataka,love Marriage,wife

సంసారం అనేది ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటేనే సాఫీగా సాగుతుంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుంటే అసలు కలిసి జీవించడం వృదా..

మరికొన్ని గంటల్లో శోభనం, అప్పుడే వాంతులు చేసుకున్న పెళ్లి కూతురు.. అంతా రచ్చ రచ్చ-Husband Doubts Wife And Tests Her

ఎందుకంటే అనుమానం ఉన్న సమయంలో సంతోషం అస్సలు ఉండదు. అందుకే అనుమానం మొదలు అవ్వగానే వెంటనే విడిపోవడం మంచిది అనేది చాలా మంది అభిప్రాయం. నిపుణులు కూడా ఇదే అంటున్నారు.

ఒకసారి అనుమానం మొదలు అయ్యిందంటే అది మనసులో అలా ఉంటుందని అంటారు. ఇక పెళ్లికి ముందే అనుమానించిన వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పెళ్లికి ముందు అమ్మాయి కన్యత్వ పరీక్షలు చేసిన సంఘటనలు మనం ఇప్పటి వరకు చూశాం.

అయితే పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులకే కన్యత్వ పరీక్షలు చేసిన వ్యక్తి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే. కర్ణాటక రాష్ట్రంకు చెందిన 29 ఏళ్ల శరత్‌కు రక్ష అనే అమ్మాయితో పరిచయం అయ్యింది. ఇద్దరు కూడా చాలా రోజులు మాట్లాడుకోవడం, ఒకరి విషయాలు ఒకరు షేర్‌ చేసుకోవడం చేశారు. దాంతో ఇద్దరి మద్య ప్రేమ మొదలైంది. పెళ్లికి కూడా సిద్దం అయ్యారు.

గత ఏడాదిలో పెళ్లి జరగాల్సి ఉండగా రక్ష తల్లి చనిపోయింది. దాంతో పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం జరిగింది. అమ్మ చనిపోయిన బాధలో ఉన్న రక్షను పెళ్లి కోసం పదే పదే శరత్‌ ఒత్తిడి చేసేవాడు.

ఆమె ఇప్పుడు వద్దు అంటూ దాటవేయడంతో శరత్‌కు అనుమానం పెరిగింది. అదే సమయంలో ఆమె ఒక వ్యక్తితో మాట్లాడుతుందని తెలుసుకున్నాడు.

తాజాగా పెళ్లికి రక్ష ఒప్పుకోవడంతో పెళ్లి జరిగింది. పెళ్లి హడావుడి అంతా అయ్యింది, శోభనం రోజు రక్ష అజీర్తి, గ్యాస్ సమస్య కారణంగా వాంతులు చేసుకుని, కళ్లు తిరిగి పడిపోయింది.

దాంతో ఆమెను చికిత్స కోసం తీసుకు వెళ్తున్నట్లుగా చెప్పి కన్యత్వ పరీక్షలు చేయించాడు. ఆమెకు కన్యత్వ పరీక్షల విషయం తెలిసి శరత్‌ను అస్యహించుకుంది. ఇలాంటి నీచానికి పాల్పడ్డ వ్యక్తితో నేను సంసారం చేయను అంటూ అతడికి దూరంగా వెళ్లి పోయింది..

పెద్దలు మరియు స్నేహితులు ఒప్పించే ప్రయత్నం చేసినా కూడా రక్ష అందుకు ఒప్పుకోలేదు. అదే సమయంలో శరత్‌ విడాకులకు సిద్దం అయ్యాడు. రక్ష కూడా విడాకులు ఇచ్చేందుకు ఓకే చెప్పింది.

ఇలాంటి అనుమానపు పక్షితో కాపురం చేసేకన్నా విడిపోవడం ఉత్తమం అనుకుంటుంది. ప్రస్తుతం విడాకుల కేసు బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో నడుస్తోంది.