గూగుల్ మ్యాప్ స్ట్రీట్ వ్యూస్.దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇంట్లో కూర్చొని మొత్తం ప్రపంచాన్ని ఎక్కడ ఎం జరుగుతుంది అనేది చూసేయచ్చు.ఇంకా ఈ లాక్ డౌన్ సమయంలో ఎక్కువమంది ఈ స్ట్రీట్ వ్యూస్ చూసి టైం పాస్ చేస్తుంటారు.
ఒకప్పుడు ఈ గూగుల్ మ్యాప్ కేవలం మ్యాప్ అయినప్పటికీ ఇప్పుడు స్ట్రీట్ వ్యూస్ అయ్యింది.
అందుకే భూమిపై ఉన్న ఏ ప్రాంతాన్ని అయినా సరే దగ్గరగా చూసేయచ్చు.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి కూడా స్ట్రీట్ మ్యాప్స్ చూస్తున్నాడు.ఇంకా ఒక ప్రాంతాన్ని చుసిన సమయంలో అతను షాక్ కి గురయ్యాడు.
ఇంకేముంది వెంటనే అతని భార్యతో విడాకులు తీసుకున్నాడు.ఈ ఘటన పెరు రాజధాని లిమాలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్‌ను చూస్తూ వారి సిటీలో ఉన్న మ్యాప్ ను, విధులను, మనుషులను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు.ఇంకా అప్పుడే ఓ వీధిలో ఫుట్ పాత్ పై కూర్చున్న మహిళ, తన ఒడిలో ప్రియుడును పడుకోబెట్టుకొని తాపీగా కబుర్లు చెప్తుంది.వ్యక్తుల ప్రైవసీ నిమిత్తం గూగుల్ ఆ ఫొటోలోని ముఖాలను బ్లర్ చేసినప్పటి అతను తన భార్య అని కనుక్కున్నాడు.
ఆమె డ్రెస్ ని, హెయిర్ స్టైల్ ని చూసి కనుక్కున్నాడు.దీంతో అతని భార్య ఇంటికి రాగానే ఆ ఫోటో చూపించి అడగగా ఆమె కాదు అని చెప్పింది.
అయినప్పటికీ అతను అవి ఏమి వినకుండా ఆమెతో విడాకులు తీసుకొనేందుకు సిద్ధం అయ్యాడు.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.