విడాకులు కోరుతున్న భర్త.. తను చెప్పే కారణాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

ఈ మధ్య భారతీయ వివాహ వ్యవస్థ కొందరి కారణంగా అపహాస్యం అవుతుంది.భార్య భర్తల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు చోటు చేసుకోవడం సహజమే.

 Husband Vinay Demands Divorce For Silly Reasons, Nizamabad, Husband, Divorce, Si-TeluguStop.com

అలా ఉంటేనే కాపురాలు మరింత బలపడతాయి.కానీ ఆ గొడవలు కాస్తా ఎక్కువయితే ఆ కాపురాలు నిలబడవు.

ఈ మధ్య చిన్న చిన్న తగాదాలకు కూడా చంపుకోవడమో లేదంటే ఆత్మహత్య చేసుకోవడమో చేస్తున్నారు.

మరికొంతమంది విడాకుల కోసమని వరకు వెళ్తున్నారు.

తాజాగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక ఘటన జరిగింది.పెళ్లి అయ్యి మూడేళ్లు కాపురం చేసిన తర్వాత భర్త విచిత్ర కారణాలతో విడాకులు కావాలని కోర్టుకెక్కాడు.

కానీ ఆమె నాకు విడాకులు వద్దు.నా భర్త నాకు కావాలి.

అని ధర్నా చేస్తుంది.భర్తకు ఎంత సర్దిచెప్పిన కౌన్సిలింగ్ ఇప్పించినా అతడిలో మార్పు రాలేదు.

అందుకే న్యాయం చేయాలనీ ధర్నా చేస్తుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

నిజామాబాద్ కు చెందిన వినయ్ కుమార్ కు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలానికి చెందిన కీర్తితో నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది.వీరు దగ్గరి బంధువులు కావడంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లిని ఘనంగా జరిపించారు.

పెళ్ళికి వరకట్నంగా 4 లక్షలు పైచిలుకు ముట్టజెప్పారు.వీరి కాపురం ఎక్కువ రోజులు సజావుగా సాగలేదు.

పెళ్లి జరిగిన మూడు నెలలకే కాపురంలో గొడవలు మొదలయ్యాయి.

Telugu Divorce, Keerthi, Nizamabad, Sakhi, Silly, Vinay-Latest News - Telugu

వినయ్ పెళ్లి జరిగిన మూడు నెలలకు వేరే అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ భార్యకు దొరికిపోయాడు.ఎవరితో మాట్లాడుతున్నావ్ అని ప్రశ్నించిన భార్యను కొట్టి ఇంట్లో నుండి గెంటేసాడు.నాలుగు నెలల తర్వాత పంచాయతీ పెట్టి ఇద్దరినీ మల్లి కలిపారు.

ఈ గొడవ తర్వాత 6 నెలలు బాగానే ఉన్నా మళ్ళీ వినయ్ తాగి వచ్చి భార్యను రోజూ కొట్టేవాడు.దీంతో కీర్తి పుట్టింటికి వెళ్ళింది.సంవత్సరం పాటు అక్కడే ఉన్నా భార్య కోసం వినయ్ అక్కడికి వెళ్ళలేదు.

కీర్తి భర్త మీద సఖీ సెంటర్ లో ఫిర్యాదు చేయగా వారు వినయ్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఆ కౌన్సిలింగ్ సమయంలో భార్యను ఇంటికి తీసుకు వెళతా అని చెప్పి అలా చెయ్యలేదు.మళ్ళీ పెద్దమనుషుల దగ్గరకు పిలిచినా రాలేదు.దాదాపు నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత నువ్వు సన్నగా ఉన్నావు.అందంగా లేవు అంటూ పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి విడాకులు ఇవ్వాలని తనను ఇంట్లో నుండి గెంటేసాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది.

గత మూడు రోజులుగా భర్త ఇంటి ముందు తల్లిదండ్రులతో ధర్నా చేస్తుంది.నాకు న్యాయం చెయ్యాలని అప్పటి వరకు అక్కడి నుండి వెళ్లను అని భైఠాయించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube