టిక్ టాక్ కి బలైన మరో పచ్చని కాపురం...  

Husband Complaint Against His Wife In Tamilnadu - Telugu Husband, Husband Complaint, Husband News, Tamil Nadu Crime News, Tamil Nadu Latest News, Tamil Nadu Local News, Tamil Nadu News

ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు టిక్ టాక్ మోజులో పడి కుటుంబ బాధ్యతలను విస్మరిస్తున్నారు.తాజాగా ఓ మహిళ నిరంతర టిక్ టాక్ వీడియోలు చేస్తూ కుటుంబాన్ని మరియు పిల్లల్ని పక్కన పెట్టినందుకు ఆమె భర్త ఏకంగా విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Husband Complaint Against His Wife In Tamilnadu

వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని వేలూరు ప్రాంతంలో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.అయితే ఈ దంపతుల్లోని  మహిళ భర్త కుటుంబ పోషణ నిమిత్తం చిరు వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.అయితే మహిళ మాత్రం ఇంట్లోనే ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటూ వుండేది.

అయితే ఇంట్లో ఒక్కతే ఉండడం వల్ల ఒంటరితనాన్ని ఫీల్ అయినటువంటి మహిళ తనకు స్మార్ట్ ఫోన్ కొనిమ్మని భర్తని అడిగింది.దీంతో ఆమె కోరిక మేరకు స్మార్ట్ ఫోన్ని కొనిచ్చాడు.

దీంతో మహిళ తన స్నేహితుల సమాచారంతో టిక్ టాక్ వీడియో గురించి తెలుసుకుంది.అనుకున్నదే తడవుగా ఫోన్లో టిక్ టాక్ యాప్ ని ఇన్స్టాల్ చేసి వీడియోలను చూడడం మొదలు పెట్టింది.

రానురాను తాను కూడా పలురకాల పాటలు, డాన్సులు, చేస్తూ కవితలు చెబుతూ టిక్ టాక్ వీడియోలు చేస్తుండేది.దీంతో కుటుంబాన్ని నెగ్లెట్ చేసింది.అలాగే తన వీడియోలకి లైకులు కొడుతూ ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మరో వ్యక్తితో పరిచయం ఏర్పర్చుకుంది.ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ క్రమంలో మహిళ తన ప్రియుడిని అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేది.అయితే ఈ విషయాలను గమనించినటువంటి మహిళ భర్త వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించాడు.

అలాగే టిక్ టాక్ కి బానిసై తన కుటుంబాన్ని నెగ్లెట్ చేసినటువంటి భార్య తనకు ఇంక వద్దని విడాకులు ఇప్పించ వలసిందిగా పోలీసులను కోరుతున్నాడు.

తాజా వార్తలు

Husband Complaint Against His Wife In Tamilnadu-husband Complaint,husband News,tamil Nadu Crime News,tamil Nadu Latest News,tamil Nadu Local News,tamil Nadu News Related....