భర్త విదేశాల్లో... భార్య డ్రైవర్ తో...

Husband Complaint Against His Wife

ప్రస్తుత కాలంలో కొందరు కామ వాంఛలను అదుపులో పెట్టుకోకుండా కుటుంబ పరువును, మరి తోటివారు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.తాజాగా ఓ మహిళ భర్త సంపాదన నిమిత్తమై ఇతర దేశాల్లో ఉండగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని విచ్చలవిడిగా తిరుగుతూ అతడితోనే పరారయిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 Husband Complaint Against His Wife-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని ఓ గ్రామంలో సంగీత అనే వివాహిత నివాసం ఉంటోంది. అయితే ఈమె భర్త డబ్బు సంపాదన నిమిత్తమై ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు.

దీంతో సంగీత భర్త రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు.సంగీత స్థానికంగా ఉన్నటువంటి ఓ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది.

అయితే భర్త ఇతర దేశాల్లో ఉండటంతో తనలో ఉన్నటువంటి కామ వాంఛలను అదుపు చేసుకోలేక పోయింది.దీంతో తాను పని చేస్తున్నటువంటి పాఠశాలలో వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్నటువంటి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

అంతేగాక ఈ మధ్యకాలంలో వీళ్లు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించారు.

దీంతో సంగీత ప్రవర్తనపై అనుమానం వచ్చినటువంటి ఆమె భర్త కుటుంబ సభ్యులు ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించారు.అయినప్పటికీ సంగీత తన ప్రవర్తన మార్చుకోకుండా ఉండేది.దీంతో తాజాగా ఈ విషయమై సంగీతతో కుటుంబ సభ్యులు మరోసారి గొడవ పడ్డారు.

దీంతో సంగీత తాను వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి స్కూల్ వ్యాన్ డ్రైవర్ తో పరార్ అయింది.ఈ విషయం తెలుసుకున్నటువంటి సంగీత కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు నమోదు చేశారు.

సంగీత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న టువంటి పోలీసులు పరారీలో ఉన్నటువంటి సంగీత మరియు ఆమె ప్రియుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

#Tamil Nadu #Tamil Nadu #Tamil Nadu #Complaint #Tamil Nadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube