భార్యను డంబల్ తో కొట్టిన భర్త.. కూతురితో అసభ్యంగా !

మద్యానికి బానిసైన భర్త తన భార్యను డంబల్ తో తల బద్దలు కొట్టిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలంలో చోటు చేసుకుంది.కొవ్వూరుకు చెందిన డి.

 Ap, East Godavari, Husband, Wife, Dumbbell-TeluguStop.com

శ్రీను ఆర్టీసీలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.తరచూ ఇంటికి తాగి వచ్చి భార్య మాధవితో గొడవకు దిగేవాడు.

ఈ క్రమంలో భార్యతో గొడవపడి డంబల్ తో తల బద్దలు కొట్టాడు.దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది.

గొడవను కూతుర్లు వీడియో తీస్తున్న పట్టించుకోకుండా వీరంగం సృష్టించాడు.అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేసుకోండని రెచ్చిపోయాడు.

మాధవిని ఆస్పత్రి తరలించి చికిత్స అందజేశారు.స్పృహలో వచ్చిన తర్వాత మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఫిర్యాదులో ఇలా మాట్లాడుతూ.మద్యానికి బానిసై రోజూ నరకం చూపిస్తాడని భార్య మాధవి చెప్పుకొచ్చింది.

కూతుళ్లపై అసభ్యంగా ప్రవర్తిస్తాడని ఆమె వాపోయింది.కొద్ది నెలల కిందట తనని కత్తితో చంపేందుకు ప్రయత్నించాడని, వేరే పెళ్లి చేసుకోవడానికి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొంది.

కన్న కూతుళ్లతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తాడని వాపోయింది.అధికార పార్టీ అండదండలు ఉందని, అందుకే రెచ్చిపోతున్నాడని తెలిపింది.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.కాగా, శ్రీను పరారీలో ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube