మాంత్రికుడు చెప్పినట్లుగా వినలేదని భార్యను నడి రోడ్డుపై కొట్టిన భర్త... ఆ తర్వాత జనాలకు ట్విస్ట్‌ ఇచ్చిన భార్య  

Husband Beats Wife Brutally In Front Of Villagers In Rajasthan-husband Beats Wife,police Complaint,rajasthan,villagers

జనాలకు మూడనమ్మకం ముదిరితే పిచ్చిగా మారుతుంది. ఆ పిచ్చిలో ఏం చేస్తున్నామో అనే విషయం కూడా తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా ఒక వ్యక్తి తన భార్యను నడి రోడ్డుపై పిచ్చి కుక్కను కొట్టినట్లుగా బెల్టుతో, రాళ్లతో, కర్రతో కొట్టాడు...

మాంత్రికుడు చెప్పినట్లుగా వినలేదని భార్యను నడి రోడ్డుపై కొట్టిన భర్త... ఆ తర్వాత జనాలకు ట్విస్ట్‌ ఇచ్చిన భార్య-Husband Beats Wife Brutally In Front Of Villagers In Rajasthan

చట్టు పక్కల వారు వచ్చినా కూడా ఆగకుండా ఆమెను అంతగా కొట్టడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆమెను అంతగా కొట్టడానికి కారణం ఆమెలో దెయ్యం ఉందని, ఆ దెయ్యాని కొడుతున్నాను అంటూ అతగాడు చెప్పడం జరిగింది. ఆ భార్య కూడా తర్వాత రోజు నా భర్త నన్ను కొట్టలేదు, అసలేం జరిగిందో తెలియదు అన్నట్లుగా చెప్పడం కొసమెరుపు.

ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే…

వైధ్యుల వద్దకు తీసుకు వెళ్తే ఏం లేదని, కొన్ని మందులు ఇచ్చి పంపుతున్నారు. ఎన్ని హాస్పిటల్స్‌ తిరిగినా కూడా ఆమె కడుపు నొప్పికి సరైన మందు లభించలేదు. దాంతో ఒక వ్యక్తి చెప్పిన సలహామేరకు ఆ భర్త తన భార్యను ఒక మంత్రగాడి వద్దకు తీసుకు వెళ్లాడు.

అతడు ఆమెను చూసిన తర్వాత నీ భార్య మీద దెయ్యం ఉంది, ఆ దెయ్యం వల్లే కడుపు నొప్పి అంటూ చెప్పాడు.

దెయ్యంను వదిలించేందుకు పూజలు చేయాలి, నేను చేప్పినట్లుగా చేయి అంటూ పూజకు ఏర్పాట్లు చేయించాడు. పూజకు అంతా సిద్దం అయ్యింది. పూజ సమయంలో నేను చెప్పినట్లుగా చేయి అంటూ ఆమెతో మాంత్రికుడు అన్నాడు.

అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు. దాంతో కోపోద్రిక్తుడు అయిన భర్త తన భార్య ఒంట్లో ఉన్న దెయ్యం ఆ పని చేయనివ్వడం లేదని భావించాడు. బెల్ట్‌తో పిచ్చిగా కొట్టాడు...

రోడ్డు మీదకు వచ్చినా కూడా వదలకుండా విచక్షణ మరిచి చితక బాదాడు. స్థానికులు ఆమెను కొట్టడాన్ని వీడియో కూడా తీశారు. అది కాస్త పోలీసుల వద్దకు చేరింది.

కొట్టిన విషయంను ఆమెను ప్రశ్నించగా తన భర్త కొట్టలేదని, అసలేం జరిగిందో నాకు తెలియదు అంటూ జనాలకు షాక్‌ ఇచ్చింది. ఆమె అలా చెప్పడంతో జనాలు అంతా కూడా నిజంగానే ఆ సమయంలో ఆమె మీద దెయ్యం ఉండి ఉంటుందని భావిస్తున్నారు.