గూగుల్‌లో ఉద్యోగం చేస్తున్న భార్యాభ‌ర్త‌లు... హ‌ఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోవ‌డంతో...

గూగుల్ 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది.తొలగించిన ఉద్యోగుల్లో కొందరు 20 ఏళ్లుగా, మరికొందరు 15 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ ఒక్కసారిగా వారంతా నిరుద్యోగులయ్యారు.4 నెలల క్రితమే తల్లిదండ్రులుగా మారిన ఓ జంటకు గూగుల్ సంస్థ నుంచి బయటకు రావాల్సివ‌చ్చింది.ఆ మహిళ ఇంకా ప్రసూతి సెలవులో ఉంది.

 Husband And Wife Working In Google Suddenly Lost Their Jobs ,jobs, Google  ,mate-TeluguStop.com

పిల్లల తండ్రి పితృత్వ సెలవుకు ఎదురు చూస్తున్నాడు.ఇంత‌లోనూ గూగుల్‌ వారిద్దరినీ సంస్థ నుంచి సాగ‌నంపింది.

ఒడిలో 4 నెలల పాప.క‌నిక‌రం లేకుండా కంపెనీ తొలగించిందిఎలీ గూగుల్‌లో పని చేసేవారు.ఆమె 4 నెలల క్రితమే తల్లి అయ్యింది.ప్రసూతి సెలవులో ఉంది.అయితే కంపెనీ రిట్రెంచ్‌మెంట్ ప్రకటించినప్పుడు, ఆమె పేరు కూడా ఉంది.ఒకే స్ట్రోక్‌లో కంపెనీ 4 నెలల చిన్నారికి తల్లి అయిన ఆమెను ఉద్యోగం నుండి తొలగించింది.

ఎలీ భర్త స్టీవ్ కూడా గూగుల్‌లో పనిచేసేవాడు.అత‌నిని కూడా కంపెనీ బయటకి పంపించింది.

Telugu Google, Jobs, Maternity Leave, Steve, White Cube-Latest News - Telugu

ఆ మహిళ 6 సంవత్సరాలుగా పని చేస్తోంది ఎలీ గత 6 సంవత్సరాలుగా గూగుల్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.ఆమె భర్త స్టీవ్ 4 సంవత్సరాల క్రితం కంపెనీలో చేరి రీసెర్చ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.ఇద్దరూ కాలిఫోర్నియాలో విధులు నిర్వ‌హిస్తున్నారు.

ఎలీ 4 నెలల పాప ఉన్నందున‌ 8 నెలల పాటు సెలవులో ఉండాలని ప్లాన్ చేసింది.స్టీవ్ 2022 సంవత్సరంలో రెండు నెలల సెలవు తీసుకున్నాడు.

మార్చి 2023లో రెండు నెలల సెలవు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.అయితే అంతకుముందే కంపెనీ వారిద్దరినీ ఉద్యోగం నుంచి తొలగించింది.

Telugu Google, Jobs, Maternity Leave, Steve, White Cube-Latest News - Telugu

వ్యాపారంపై దృష్టి పెట్ట‌నున్న దంప‌తులు బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం, ఉద్యోగం నుండి తొలగించబడిన తర్వాత ఎలీ తాను గూగుల్‌లో గడిపిన సమయాన్ని అత్యుత్తమంగా అభివర్ణించారు.తాను మరియు స్టీవ్‌కు ఉద్యోగం కోల్పోవ‌డంతో ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటారని, ఈ సమయాన్ని ఎదగడానికి ఉపయోగించుకుంటారని చెప్పారు.వారు వ్యాపారం చేయాల‌నుకుంటున్నారు.2014లో ఇద్దరూ కలిసి కంపెనీల కోసం యానిమేటెడ్ వీడియోలను రూపొందించే వైట్ క్యూబ్ మీడియా అనే కంపెనీని ఏర్పాటు చేశారు.ఈ జంట ఇప్పుడు తమ వ్యాపారం కోసం పని చేయాలనుకుంటున్నారు.వైట్ క్యూబ్ మీడియా కోసం పని చేస్తానని ఎలి చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube