నాకే వెన్నుపోటు పొడుస్తారా ? ఎవ్వరినీ వదలనంటున్న బాబు !  

Hurting Chandrababu In Happy Resorts-

నన్నే నమ్మించి మోసం చేస్తారా ? పార్టీని చేజేతులా మీరే పాడు చేసి ఇప్పుడు తెగ కష్టపడిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఎవరు ఏమి చేశారో నా దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరినీ వదిలిపెట్టను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేసాడు..

నాకే వెన్నుపోటు పొడుస్తారా ? ఎవ్వరినీ వదలనంటున్న బాబు !-Hurting Chandrababu In Happy Resorts

కొంతమంది పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పార్టీకి వెన్నుపోటు పొడిచిన విషయాలు తన దృష్టికి వచ్చాయన్నారు. అలాంటి నేతల లెక్కలు తియ్యాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు నేతలు సీనియర్ నేతల్లా మాట్లాడుతున్నారని, మీడియా ముందు ఫోజులు కొడుతున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్షేత్రస్థాయిలో పని చెయ్యకుండానే బిల్డప్ ఇస్తున్నారని అటువంటి వారి వివరాలు సేకరిస్తున్నామని, త్వరలోనే వారికి తగిన బుద్ది చెప్తానన్నారు.

తాజాగా అమరావతి బాబు అధ్యక్షతన పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు మొదలుపెట్టారు. శనివారం (మే 4,2019) ఉండవల్లిలోని హ్యాపీ రిసార్ట్స్ లో రాజమండ్రి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులతో బాబు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50 మంది వరకు కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాల మీద బాబు సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా బాబు తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని వెళ్లగక్కారు.

సొంత బూత్ లో ఓట్లు కూడా రావు కానీ తామేదో రాష్ట్ర స్థాయి నాయకుల్లో కొంతమంది ఫీల్ అయిపోతున్నారు అంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఉపయోగం లేని నాయకులను పెట్టుకుని నేనేం చేయాలి అంటూ ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం దృష్టిలో పని చేస్తున్నట్టు నటిస్తూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారి బండారం త్వరలోనే బయటపడబోతోంది అన్నారు.

పార్టీకి ద్రోహం చేసిన వారి వివరాలను ఈ ఏడు నియోజకవర్గాలకు చెందిన నాయకులను అడిగి బాబు తెలుసుకున్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తమ సొంత బూత్ లో ఓట్లు సాధించగలగాలని అన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్, ఎంపీ అభ్యర్థులను ఓడించేందుకు సొంత పార్టీ నాయకులే కుట్ర చేసారని టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వాక్యాలు కూడా ఇక్కడ ప్రస్తావనికి వచ్చాయి..