లూసియానాలో వరద భీభత్సం

గడిచిన నెల రోజుల కాలంలో అమెరికాని ప్రకృతి గజగజ వణికేలా చేస్తోంది.భారీ గాలులతో, కుండపోత వర్షాలతో, వరద భీభత్సం సృష్టించి అతలాకుతలం చేస్తోంది.

అట్లాంటిక్ మహా సముద్రం వైపు నుంచీ విరుచుకుపడిన హరికేన్ ఒక్క సారిగా విరుచుకు పడటంతో లోతట్టు ప్రాంతమైన బార్రీని ముంచెత్తింది.అయితే మళ్ళీ ఈ ప్రభావం ఇన్‌ల్యాండ్ వైపుగా మళ్ళడంతో పెద్దగా నష్టం వాటిల్లలేదు.అయితే

లూసియానాలో వరద భీభత్సం -  Hurricanelouis

పెద్ద నగరమైన న్యూ ఓర్లీన్స్ విమానాశ్రయానికి రాకపోకలు అన్నీ రద్దయ్యాయి.వేలాది మంది ప్రజలు తమ ఇళ్ళు విడిచి సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది.నగరం మొత్తం విద్యుత్ లేక అంధకారంలో ఉండిపోయింది.ఈ పరిస్థితుల నేపద్యంలో అధికారులు సైనిక చర్యలకి సిఫ్ఫార్సు చేయడంతో ప్రజలలో ఆందోళన తగ్గింది.స్థానిక మేయర్ లాటోయా అందరిని సురక్షిత ప్రాంతాలకి తరలిచే చర్యలని దగ్గర ఉండిమరీ పర్యవేక్షించారు.అయితే పరిస్థితులపై ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు.

లూసియానాలో వరద భీభత్సం -  Hurricanelouis

ఇదే కోవలో లూసియానా గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ ఆందోళన వ్యక్తం చేశారు.శనివారం పగటిపూట కంటే కూడా రాత్రి పూట వర్ష తీవ్ర భయాందోళనలు కలిగించిందని ఆయన అన్నారు.గంటకి సుమారు 50 మైళ్ళ వేగంతో గాలులు వీచాయని జాతీయ హరికేన్ కేంద్రం ప్రకటనలో తెలిపింది.నదులన్నీ పొంగి పొర్లుతున్నారని, ప్రజలు ఎంతో జాగ్రత్తలు వహించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube