అమెరికాపై ప్రకృతి పగ..మొన్న కరోనా..నేడు హన్నా..!!

అమెరికాపై ప్రకృతి పగబట్టిందా.వరుస వరుసగా ఉపద్రవాలు అమెరికాని ముంచెత్తడానికి కారణం ఏమిటి అనేది చెప్పలేము కానీ మొత్తానికి అమెరికా ప్రజలు ప్రకృతి ప్రకోపానికి మాత్రం పడరాని పాట్లు పడుతున్నారు.

 Hurricane Hanna Batters Covid-hit Texas Coast, Hurricane Hanna, Texas, America-TeluguStop.com

కరోనా అమెరికాలో ఎంతటి ప్రళయాన్ని సృష్టించిందో ఎంత మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో తెలిసిందే.ఇప్పటికి వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితులలో అమెరికాపై హరికేన్ ఒక్క సారిగా విరుచుకుపడింది.విధ్వంసం సృష్టించింది.

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హన్నా హరికేన్ అల్లకల్లోలం సృష్టించింది.భారీ వర్షాలు పడటంతో కొండ చెరియలు విరిగిపడి వరదలు ఉదృతం అవుతున్నాయని అధికారులు తెలిపారు.అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం గతంలో ఈ స్థాయిలో భారీ హరికేన్ రాలేదని, భారీ గాలులు, వర్షంతో విరుచుకు పడుతోందని తెలిపారు.అంతేకాదు ఈ హరికేన్ కారణంగా పోర్ట్ మ్యాన్స్ ఫీల్డ్ కి సౌత్ లో గంటకి 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

Telugu America, Hurricane Hanna, Hurricanehanna, Texas-

హన్నా ప్రభావంతో ఇప్పటికే టెక్సాస్ లో భారీ వర్షం ఏర్పడగా సుమారు 12 మీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని తెలిపారు అధికారులు.అలాగే దక్షిణ టెక్సాస్, మెక్సికన్ లాంటి పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు 18 మీటర్ల మీరా కురవనున్నాయని ప్రకటించారు.అయితే ఇప్పటికే టెక్సాస్ లో హన్నా హరికేన్ తీరం దాటిపోగా మిగిలిన రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కూడిన గాలులు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఇదిలాఉంటే కరోనా దెబ్బకే అల్లల్లాడి పోయిన అమెరికా ప్రజలు ఈ ఉపద్రవంతో మరింత ఆవేదన చెందుతున్నారని స్థానిక మీడియా పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube