డోరియన్ హరికేన్ ధాటికి వణికిపోతున్న అమెరికా  

Hurricane Dorian Hits East Coast Of Central Florida-florida\\'s East Coast,hurricane Dorian,the Category 2 Storm

డోరియన్ హరికేన్ ధాటికి అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా చివురుటాకులా వణికిపోతోంది.ప్రస్తుతం ఇది నెమ్మదిగా కదులుతూ ఫోరిడా తూర్పు తీరం వద్ద గ్రాండ్ బహామస్ సమీపంలో కేంద్రీకృతమై ఉంది.దీనిని కేటగీరి-2 తుఫానుగా వాతావరణ శాఖ తెలిపింది.

Hurricane Dorian Hits East Coast Of Central Florida-florida\'s East Coast,hurricane Dorian,the Category 2 Storm-Hurricane Dorian Hits East Coast Of Central Florida-Florida\'s Hurricane The Category 2 Storm

దీని ప్రభావంతో తీరం వెంట గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచినట్లుగా జాతీయ హరికేన్ సెంటర్ వెల్లడించింది.జార్జియా, ఫ్లోరిడా, కరోలినాలకు రెండు రోజులు పాటు ముప్ప తప్పదని హెచ్చరించింది.

Hurricane Dorian Hits East Coast Of Central Florida-florida\\'s East Coast,hurricane Dorian,the Category 2 Storm-Hurricane Dorian Hits East Coast Of Central Florida-Florida\\'s Hurricane The Category 2 Storm

మరోవైపు బుధవారం అర్ధరాత్రి నుంచి హరికేన్ తీవ్రత పెరుగుతుందని.అట్లాంటిక్ తీరం వెంబడి ఉన్న ప్రాంతాలు అప్రమత్తంగా వ్యవహరించాలని హరికేన్ సెంటర్ పేర్కొంది.మరోవైపు డోరియన్ ధాటికి బహమాస్‌లో వేలాది ఇళ్లు నేలమట్టం కాగా.లెక్కకు మించి చెట్లు కూలిపోయాయి.ప్రజలు ప్రాణాలను కాపాడురోవడానికి మిద్దెల మీదకు ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

డోరియన్ కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు దుర్మరణం పాలవ్వగా.పలువురు గల్లంతయ్యారు.కరెంట్ స్తంభాలు కూలిపోవడంతో నగరంలో అంధకారం నెలకొంది.మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.మరో రెండు రోజుల పాటు డోరియన్ విలయ తాండవం తప్పదని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.