మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై వేటు..!

ప్రస్తుతం సమాజంలో మహిళలపై వేధింపులు తగ్గడం లేదు.అధికారులు సైతం వేధింపులకు పాల్పడుతున్నారు.

 Hyderabad, Police, Suspend, Woman-TeluguStop.com

ఇటీవల ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పందించారు.గత కొద్ది నెలలుగా స్పెషల్ బ్రాంచ్ లో ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న చందర్ కుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వేధింపులకు గురి చేస్తున్నాడని ఆ మహిళ సీపీకి ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు సీపీ అంజనీకుమార్ స్పందించి సీఐ చందన్ కుమార్ ను సస్పెండ్ చేశాడు.మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు విధుల నుంచి తొలగిస్తూ క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.

మహిళ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు సీపీ.సీఐ చందన్ కుమార్ ను పిలిపించి విచారణ చేపట్టగా తప్పు నిర్ధారణ అయింది.

దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అనంతరం సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.

వేధింపులకు ఎవరైనా పాల్పడితే మహిళలు నిర్భయంగా ముందుకురావాలని పేర్కొన్నారు.సైబర్ నేరగాళ్ల వలలో యువతులు బలవుతున్నారని, మీరు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు.

ఎవరైనా వేధింపులకు పాల్పడితే ఫోన్ : 9490616555 నంబర్ కు వాట్సాప్ చేయాలని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.వేధింపులు పాల్పడేది ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube