అమానుషం: నిండు గర్భంతో ఉన్న పులిని సజీవ దహనం చేసిన వేటగాళ్లు.. ఎక్కడంటే..?!

మనిషి చేసే తప్పులకు వన్యప్రాణులు ప్రాణాలు విడుస్తున్నాయి.మనిషి స్వార్థం కోసం మూగజీవాలను బలితీసుకుంటున్నారు.

 Hunters Burn And Killed A Pregnant Tiger In Maharashtra , Pregnant Tiger ,killed-TeluguStop.com

అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం శూన్యం.ఎక్కడో ఓ చోటు ఓ మూగ జీవి బలైపోతోంది.

రాబోయే రోజుల్లో కొన్ని రకాల జంతువులు కనుమరుగు కానున్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు.మనుషులు మూగజీవాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరిస్తున్నారు.

వేటగాళ్ల వలలో ఓ గర్భం దాల్చిన పులి చిక్కింది.వేటగాళ్ల ఉచ్చులో చిక్కి అతికిరాతకంగా ఆ పులి మృతిచెందింది.

ఈ ఘటన మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.సోమవారం యావత్‌మాల్‌ జిల్లా పాండరకవుడ అటవీశాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.

ముకుట్‌బన్‌ క్షేత్రంలోని ముంగోలీ అటవీ ప్రాంతంలోని కాలువ వద్ద ఆదివారం గస్తీ నిర్వహించిన అటవీశాఖ ఉద్యోగులు పులి కళేబరాన్ని గుర్తించారు.ముంగోలీ కాలువ వద్ద ఓ గుహ పులి నివాసస్థానం అని గుర్తించిన దుండగులు దాని ముందుభాగంలో వెదురుతో మంటపెట్టారు.

గుహ నుంచి బయటకు వచ్చేసమయంలో ఇనుపతీగతో బంధించి హతమార్చారు.

విషయం తెలుసుకున్న ముకుట్‌బన్‌ సియఫ్‌ఓ విజే వరే, పెంచి అభయాణ్యాలకు చెందిన పశువైద్యాధికారి చేతన్‌ పాతాండే తదితరులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని శవపరీక్షలు నిర్వహించారు.

నాలుగేళ్ల ఆడపులిగా గుర్తించారు.ఇది గర్భం దాల్చిందని, కడుపులో నాలుగు పిల్లలు ఉన్నట్లు నిర్ధారించారు.వేగిన్ అనే ఈ పులిని అత్యంత కిరాతకంగా దాన్ని హింసించి సజీవ దహనం చేసి అది చనిపోయాక దాని ముందు పంజాలను వేటగాళ్ళు కత్తిరించుకుపోయారు.ప‌దునైన ఆయుధాల‌తో దూరంగా నిలబడి పొడిచి చూసి అది పూర్తిగా ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించుకున్నాక దాన్ని గోళ్లను కత్తిరించి పట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది.

పులి శరీరంపై గాయాలు ఉన్నాయి.ముందు పాదాలకు చెందిన కాలిగోళ్లు దుండగులు అపహరించినట్లు వివరించారు.

కేసునమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు.నెలరోజుల కిందట ఇదే జిల్లాలోని ఉమ్రేడ్‌ -కరంజ అడవులలో దుండగుల చేతిలో పులి మృతి చెందింది.

ఈ ఘటనలపై అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు దుండగులను త్వరగా పట్టుకొని పులుల మరణాలను నివారిస్తామని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube