నువ్వు దేవుడివి సామి : షాప్‌లో దొంగతనం చేసిన కుర్రాడికి ఆ షాప్‌ ఓనర్‌ ఏమిచ్చాడో తెలుసా?

కొందరు లగ్జరీ జీవితం కోసం దొంగతనాలు చేస్తారు, కొందరు తినడానికి తిండి లేక దొంగతనాలు చేస్తారు.మరి కొందరు మాత్రం సరదా కోసం చేస్తారు.

 Hungry Teen Caught Stealing Food Store Owner Does An Amazing Thing Instead Of B-TeluguStop.com

దొంగతనం ఏ కారణం చేత చేసినా కూడా శిక్ష పడటం ఖాయం.అయితే తినడానికి తిండి లేక, ఆకలితో చేసే దొంగతనం పట్ల మనం మానవతా దృక్పదంతో ఆలోచించాలి.

ఒక వ్యక్తి తినడానికి తిండి లేక దొంగతనం చేశాడంటే అతడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాలి.అంతే తప్ప అతడిని లేదా ఆమెను హించించేందుకు ప్రయత్నించవద్దు.

అప్పుడు ఆ వ్యక్తి లగ్జరీ కోసం దొంగతనాలు చేసేందుకు సిద్దం అవుతాడు.

తినడానికి తిండి లేని సమయంలో అమెరికాకు చెందిన ఒక యువకుడు షాప్‌లో దొంగతనం చేసేందుకు సిద్దం అయ్యాడు.

అయితే అతడు ప్రొఫెషనల్‌ దొంగ కాకపోవడంతో అతడు చేసిన దొంగతనం వెంటనే బయట పడింది.దాంతో అతడు పట్టుబడ్డాడు.అయితే షాప్‌ యజమాని మంచి తనంతో అతడికి ఎలాంటి శిక్ష పడలేదు.పైగా షాపు యజమాని అతడి ఆకలితో పాటు అతడి తమ్ముడు ఆకలి కూడా తీర్చాడు.

ఇదో మంచి సంఘటనగా అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థ వార్త కథనంను ప్రచురించింది.

నువ్వు దేవుడివి సామి : షాప్‌లో

పూర్తి వివరాల్లోకి వెళ్తే… అమెరికాలోని ఓహియోమాలో ఇండియాకు చెందిన జయ్‌ సింగ్‌ టోలెడో ఒక తినుబండారాల షాప్‌ను నిర్వహిస్తున్నాడు.చాక్లెట్స్‌, క్యాండీలు, శాండ్‌ విచ్‌ ఇంకా బేకరీ ఫుడ్స్‌ను విక్రయిస్తున్నాడు.ఒక రోజు ఒక యువకుడు మెల్లగా చాక్లెట్స్‌ మరియు క్యాండీలు తిసుకుని పాకెట్‌లో వేసుకోవడం సీసీ కెమెరా ఫుటేజ్‌లో జయ్‌ సింగ్‌ చూశాడు.

వెంటనే అతడి వద్దకు వెళ్లి పట్టుకోగా అతడు కన్నీరు పెట్టుకున్నాడు.కొన్ని రోజులుగా తినడానికి సరైన తిండి లేకపోవడం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది.తమ్ముడు కూడా ఆకలితో ఉన్నాడని చెప్పుకొచ్చాడు.అతడి మాటలకు సింగ్‌ కరిగి పోయాడు.

అతడు తీసుకున్న చాక్లెట్లతో పాటు శాండ్‌విచ్‌ను కూడా ఇచ్చి పంపించాడు.ఆకలితో ఉన్న వారికి సాయం చేయమని మా ఇండియన్ సాంప్రదాయం చెబుతోందని ఆ యజమాని చెప్పిన మాటలు మన దేశంపై ఇతర దేశాల వారికి గౌరవంను పెంచాయి.ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది.జై సింగ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.అది కాస్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube