26.5 కోట్లకు చేరుకున్న ఆకలి బాధితులు... కరోనా ప్రభావం అంటున్న ఐరాస

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 13 కోట్లకి పైగా ప్రజలు అధికారికంగా ఆకలి బాధలు అనుభవిస్తున్నారు.వెనుకబడిన ఆఫ్రికా దేశాలతో పాటు, అభివృద్ధి చెందుతూ ఉన్న ఇండియా లాంటి దేశాలలో కూడా ఈ ఆకలి బాధలు పడుతున్న వారు అధిక సంఖ్యలోనే ఉన్నారు.

 Hungry People Increase Due To Corona Lock Down, Corona Effect, Covid-19, United-TeluguStop.com

ప్రపంచంలో ఆర్ధిక వనరులు ఎంతగా అభివృద్ధి చెందిన ఆకలి బాధలని మాత్రం తగ్గించలేకపోతున్నారు.అయితే ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి కారణంగా ఈ ఆకలి బాధలు పడేవారి సంఖ్య రెట్టింపు అయ్యిందని ఐరాస పేర్కొంది.

ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని ఉన్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈ విషయాన్ని అధికారికంగా ద్రువీకరించింది.ఇప్పటి వరకు ఆకలి బాధను 13 కోట్ల మంది అనుభవించగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఆ సంఖ్య 26.5 కోట్లకు చేరుతుందని పేర్కొంది.టూరిజంపై ఆధారపడిన ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలపై ఈ ప్రభావం అధికంగా ఉందని, ప్రజా రవాణా నిలిచిపోవడంతో ప్రయాణికులపై ఆధారపడి, వారికి పలు రకాల ఆహార ఉత్పత్తులను అమ్ముకుంటున్న వారూ ఆకలితో మగ్గిపోతున్నారని వెల్లడించింది.లాక్ డౌన్ నెల రోజుల వ్యవధిలోనే ఆకలితో అలమటిస్తున్న వారి జాబితాలో 13.5 కోట్ల మంది చేరిపోయారని పేర్కొన్నారు.రోజు కూలీ మీద ఆధారపడి బ్రతికేవారు ఉపాధి కోల్పోయి పేదరికంలో నెట్టబడ్డారని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube