ఏపీలో 'హంగ్' తప్పదా ? జనసేన కి అంత నమ్మకం ఏంటో ?  

Hung Result Ruled Out For Andhra Pradesh 2019 Elections-hung Result,jansena,pawan Kalyan,ఏపీలో హంగ్

ఏపీలో పదుల సంఖ్యలో సీట్లు సాధించే అంతా స్టామినా లేకపోయినా జనసేన పార్టీ ప్రభావం మాత్రం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. జనసేన పార్టీ ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ పార్టీల ఓటు బ్యాంకు ను మాత్రం బాగా ప్రభావితం చేసిందనే చెప్పుకోవాలి. జనసేన చీల్చే ఓట్లతో ఏ పార్టీ కొంప మునుగుతుందో అన్న ఆందోళన కూడా మిగతా పార్టీలో కనిపిస్తోంది...

ఏపీలో 'హంగ్' తప్పదా ? జనసేన కి అంత నమ్మకం ఏంటో ? -Hung Result Ruled Out For Andhra Pradesh 2019 Elections

పైకి మాత్రం గంభీరంగా మాటలు చెప్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పక్క ఈవీఎం లలో అవకతవకలు జరిగాయని చెప్తూ ఢిల్లీతో సహా మిగతా రాష్ట్రాలన్నీ తిరుగుతూ హడావుడి చేస్తూనే మరోపక్క ఈ ఎన్నికల్లో తమదే విజయం అంటూ గంభీరంగా మాటలు చెప్తోంది.

ఇక వైసీపీ అధినేత జగన్ విషయానికి వస్తే, అప్పుడే ఆయన సీఎం అయిపోయినంత స్థాయిలో ఇప్పటి నుంచే ఆ దర్పాన్ని ప్రదర్శిస్తూ , ఎవరెవరికి ఏ ఏ మంత్రి పదవులు ఇవ్వాలనే లెక్కల్లో ఉన్నాడు.

ఈ రెండు పార్టీలు ఇలా ఉంటే జనసేన పార్టీ మాత్రం కొత్త లెక్కలు చెబుతోంది. ఈ ఎన్నికల్లో తమదే అధికారం అని జనసేన విశాఖ అభ్యర్థి లక్ష్మినారాయణ ప్రకటించుకున్నారు. ఆయన ఒక్కరే కాదు జనసేన మద్దతుదార్లు అయిన కమ్యూనిస్టు పార్టీల వాళ్లు, జనసేనలో కొంతమంది కీలక నాయకులు ఏపీలో హంగ్ తప్పదనే విషయాన్ని తేల్చేస్తున్నారు.

ఇందులో ఎవరి లెక్కలు వారివి.

వీరు చెప్తున్న లెక్కల ప్రకారం జనసేన-బీఎస్పీ-కమ్యూనిస్టు పార్టీల కూటమికి భారీగా ఓటింగ్ జరిగిందట. కొన్ని చోట్ల అది ఇరవై ముప్పై శాతం కూడా ఉందనే విషయాన్నిచెబుతున్నారు. ఏపీలో జనసేన అధికారంలోకి రాకపోయినా హంగ్ కనుక ఏర్పడితే జనసేన మద్దతు మాత్రం ఖచ్చితంగా రెండు పార్టీల్లో ఒక పార్టీకి అవసరం అని అప్పుడు చక్రం తిప్పేది తామే అని జనసేన పార్టీలో సంతోషం వ్యక్తం అవుతోంది.

చూద్దాం ఈ అంచనా ఎంతవరకు కరెక్ట్ అనేది.