అదృష్టవంతుడు: తిమింగలం నోట్లో పడినా కానీ చివరికి..?!

సముద్రంలో వేట ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఛత్రపతి సినిమాలో హీరో ప్రభాస్ ఓ పెద్ద తిమింగళంతో పోరాటం చేసి ప్రాణాలతో బయటపడతాడు.

 Humpback Whale Swallows And Splits Lobster Diver Michael-TeluguStop.com

సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుంది.అమెరికాలో సముద్ర జంతువులలో పెద్దదిగా ఉండే హంప్ బ్యాక్ తిమింగలం నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

అతను ఆ తిమింగళంతో పోరాటం చేస్తున్నప్పుడు అది ఆయన్ని నోట్లోనే కొన్ని సెకన్ల పాటు అలానే ఉంచేసుకుంది.దాదాపుగా 40 సెకన్లు ఆయన తిమింగళం నోట్లోనే ఉండిపోయాడు.

 Humpback Whale Swallows And Splits Lobster Diver Michael-అదృష్టవంతుడు: తిమింగలం నోట్లో పడినా కానీ చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికాలో కొందరు చేపలు, రొయ్యలు వ్యాపారం చేస్తూ జీవినం సాగిస్తున్నారు.ఈ క్రమంలో మైకేల్ ప్యాకార్డ్ అనే వ్యక్తి 56 ఏళ్ల వయసులోనూ సముద్రంలో వేట ద్వారా జీవనం సాగిస్తున్నారు.

రోజూలాగా ఆ రోజు కూడా సముద్రంలోకి రొయ్యల కోసం దూకాడు.ఆయన మసాచుసెట్స్ లోని కేప్ కాడ్ అనే ప్రాంతానికి వెళ్లి వేటను ప్రారంభించాడు.

సముద్రంలో రొయ్యలను పడుతున్న క్రమంలో పొరపాటున ఆయన ఓ తిమింగళం నోట్లో పడ్డాడు.ఆ సమయంలో దాదాపుగా ఏకంగా 40 సెకన్లు నోట్లోనే ఉండిపోయాడు.తిమింగళం నోట్లో భయంభయంగా అంతసేపు ఉన్నాడు.ఆ తర్వాత ఆ తిమింగళం ఆయన్ని నోట్లోకి మింగకుండా బయటకు ఊసేసింది.

దీంతో మైకెల్ ప్రాణాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నాడు.ఈ ఘటన గురించి మైకెల్ ఫేస్ బుక్ ద్వారా కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు.

Telugu 40 Seconds In Whales Mouth, Commercial Lobster, Diver, Humpback Whale, Inside Whale\\'s Mouth, Lobster Diver Michael, Moment, Survives, Swallows And Splits, Terrifying, Usa, Viral News-Latest News - Telugu

మైకెల్ ను తిమింగలం మింగినప్పుడు ఆయనకు కొన్ని గాయాలు అయ్యాయని., ప్రొవిన్స్ టౌన్ రెస్యూ స్వ్కాడ్ సాయంతో ఆయన బతకగలిగాడు.వారే గనుకలేకుంటే ఈ పాటికి తాను ప్రాణాలతో ఉండేవాడిని కానని తెలిపాడు.మైకెల్ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు.వారు 12 ఏళ్ల ఒకడు, 15 ఏళ్ల మరో కొడుకును ఆయన ప్రాణాపాయ స్థితిలో తలచుకున్నాడు.బతుకుతానని అనుకోలేదు.

చివరికి తిమింగలం నోట్లో నుంచి ప్రాణాలతో బయటపడినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు.

#Survives #Diver #Terrifying #SwallowsAnd #40Seconds

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు