టెక్నాలజీ రోజు రోజుకీ అభివృద్ధి పధంలో దూసుకెళుతోంది.మనుషులు చేసే పనులకు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా రోబోలను పలుచోట్ల సృష్టిస్తున్నారు.
ఇపుడు అలాంటి విషయమే తెలుసు కుందాం.మనం ఎక్కడైనా హోటల్‌కు వెళ్తే.
వెంటనే మనకు ఎదురుగా వెయిటర్ వస్తాడు.ఏం కావాలో అడుగుతాడు.
కానీ కర్ణాటక మైసూర్‌లోని సిద్ధార్థ హోటల్‌కు వెళ్తే.మీరు ముందు ఓ అందమైన రోబో ప్రత్యక్షమౌతుంది.అవును.మీకు ఏం కావాలో దానికి చెబితే క్షణాల్లో తెచ్చి పడేస్తుంది.
సర్వర్‌గా సేవలు చేస్తున్న ఈ రోబో ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.మైసూర్లో పేరు పొందిన హోటల్ పేరు సిద్ధార్థ హోటల్.
నిత్యం వెయిటర్ల కొరత అక్కడ యాజమాన్యాన్ని వేధిస్తోంది.దీంతో ఓ వినూత్న ఆలోచనకు వారు శ్రీకారం చుట్టారు.
వెయిటర్ల స్థానంలో ఓ హ్యూమనాయిడ్ రోబోను నియమించారు.రూ.2.5 లక్షలు ఖర్చు చేసి డిల్లీలోని ఓ సంస్థ నుంచి కొనుగోలు చేశారు.కస్టమర్లు హోటల్‌కు రాగానే ఆహార పదార్థాల మెనూను చూపిస్తుంది ఈ రోబో.
ఒకేసారి 10 కేజీల వరకు బరువును మోయగలదు.సంప్రదాయ చీరకట్టు, ఒంటినిండా నగలతో ఈ రోబో సేవలు అందిస్తుంటే కస్టమర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ రోబోను ఆపరేట్ చేయడంలో హోటల్ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
టెక్నికల్ సమస్యలు ఎదురైనప్పుడు తయారీ సంస్థ అను సంధానంతో పరిష్కరిస్తున్నామని తెలిపారు.భవిష్యత్ లో మరో 4 రోబోలను కూడా తెప్పించు కుంటామని అక్కడి యాజమాన్యం చెప్పడం కొసమెరుపు.